Lasya Nanditha : దివంగత ఎమ్మెల్యే లాస్య నందిత కుటుంబ సభ్యుల సంచలన ఆరోపణలు

దివంగత బీఆర్ఎస్ ఎమ్మెల్యే లాస్య నందిత( Lasya Nanditha ) కుటుంబ సభ్యులు సంచలన ఆరోపణలు చేశారు.

లాస్య మృతికి పీఏ మరియు డ్రైవర్ అయిన ఆకాశే కారణమని( Akash ) వారు ఆరోపించారు.

ఆకాశ్ బలవంతంగా లాస్యను తీసుకెళ్లారని కుటుంబ సభ్యులు చెబుతున్నారని తెలుస్తోంది.అయితే ఇప్పటికే పీఏ ఆకాశ్ పై లాస్య సోదరి నివేదిత( Niveditha ) పోలీసులకు ఫిర్యాదు చేశారు.

ఈ క్రమంలో ఆకాశ్ పై పటాన్ చెరు పోలీసులు( Patancheru Police ) కేసు నమోదు చేశారు.కాగా ఎమ్మెల్యే లాస్య నందిత పటాన్ చెరు ఓఆర్ఆర్ పై జరిగిన రోడ్డు ప్రమాదంలో మృత్యువాత పడిన సంగతి తెలిసిందే.ఇదే ప్రమాదంలో పీఏ ఆకాశ్ తీవ్రంగా గాయపడటంతో ఆయన ప్రస్తుతం ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు.

డార్క్ సర్కిల్స్ వేధిస్తున్నాయా? అయితే ఈ నూనె వాడాల్సిందే!
Advertisement

తాజా వార్తలు