కాంగ్రెస్ లో మరో చిచ్చు.. రేవంత్ టికెట్లు అమ్ముకున్నాడంటూ సంచలన ఆరోపణ..!

కాంగ్రెస్( CONGRESS ) పార్టీ గొడవలు, గ్రూప్ రాజకీయాలకు పెట్టింది పేరు.ఈ పార్టీలో ఎప్పుడు ఏదో ఒక గొడవ రాజుకుంటూనే ఉంటుంది.

గల్లి నుంచి ఢిల్లీ వరకు ఇదే పరిస్థితి కనబడుతుంది.అందుకే కాంగ్రెస్ పార్టీ రెండు అడుగులు ముందుకు వేస్తే నాలుగు అడుగులు వెనక్కి అనే విధంగా జనాల మైండ్ లోకి ఎక్కింది.

ఎంతోమంది సీనియర్ నాయకులు ఉన్నా వారికి విజయం సాధించే సత్తా ఉన్నా కానీ వారి మధ్య జరిగే గొడవలే వాళ్ల ఓటమికి కారణాలు అవుతాయని రాజకీయ విశ్లేషకులు చెబుతూనే ఉంటారు.అలాంటి కాంగ్రెస్ తెలంగాణలో రేవంత్ రెడ్డి( Revanth Reddy ) టీపీసీసీ అధ్యక్షులు అయిన తర్వాత కాస్త ఊపు వచ్చింది.

ఈసారి బీఆర్ఎస్ కు(BRS) ప్రధాన పోటీ ఇచ్చేది కాంగ్రెస్సే అనే స్థాయికి చేరింది.ఈ తరుణంలోనే ప్రస్తుతం తెలంగాణ కాంగ్రెస్ లో ఉన్నటువంటి కొంతమంది పెద్దలకు మరియు రేవంత్ రెడ్డికి అస్సలు పడడం లేదు.

Advertisement

దీంతో వారి లోలోపల చర్చించుకునేటువంటి కొన్ని విషయాలను బహిరంగంగానే మీడియా ముందు బయట పెట్టేసుకుంటున్నారు.అయితే తాజాగా కాంగ్రెస్ సీనియర్ మనోహర్ రెడ్డి( MANOHAR REDDY ) చేసిన వ్యాఖ్యలు సంచలనంగా మారాయి.ఇంతకీ ఆయన ఏమన్నారయ్యా అంటే.

మహేశ్వరం టిక్కెట్ కోసం రేవంత్ రెడ్డి 10 కోట్ల రూపాయలు తీసుకున్నారని, అంతేకాకుండా 5 ఎకరాల భూమి రాయించుకున్నాడని మీడియా ముఖంగా ఆరోపించారు.ఈ విషయాలను మొత్తం మేము సాక్షాలతో సహా బయటపెడతామని మనోహర్ రెడ్డి తెలియజేస్తున్నారు.

టీపీసీసీ అధ్యక్షులు రేవంత్ రెడ్డి బండంగ్ పేట మేయర్ చిగురింత పారిజాత నర్సింహారెడ్డి( NARSIMHA REDDY ) దగ్గర 10 కోట్ల రూపాయలు, 5 ఎకరాల భూమి రాయించుకున్నాడు అంటూ ఆయన షాకింగ్ విషయాలు బయట పెట్టారు.ఇదే విషయాన్ని పార్టీ సీనియర్ నేత వి.హనుమంతరావు( HANUMANTHARAO ) సైతం చెప్పారని, టైం వచ్చినప్పుడు అన్ని సాక్ష్యాలతో బయటపెడతానని అన్నాడు మనోహర్ రెడ్డి.ప్రస్తుతం ఆయన చేసిన కామెంట్స్ రాష్ట్రవ్యాప్తంగా సంచలనం సృష్టిస్తున్నాయి.

దీనిపై కాంగ్రెస్ అధిష్టానం రేవంత్ రెడ్డి ఏ విధంగా స్పందిస్తారో చూడాలి.

పుష్ప 2 పై అంబటి కామెంట్స్ .. వారిని అరెస్ట్ చేయకపోవడంపై ఫైర్ 
Advertisement

తాజా వార్తలు