హత్యయత్నం కేసులో హీరో అరెస్టు

నిన్నటి తరం హీరోల్లో ప్రముఖుడు వినోద్‌ కుమార్‌.20 సంత్సరాల క్రితం ఈయన నటించిన పలు సినిమాలకు తెలుగు ప్రేక్షకులు బ్రహ్మరథం పట్టారు.

ఈయన ప్రస్తుతం కూడా పలు చిత్రాల్లో క్యారెక్టర్‌ ఆర్టిస్టుగా నటిస్తున్నాడు.

నటనతో పాటు వ్యాపారం చేస్తూ ఉన్న వినోద్‌ కుమార్‌పై పోలీసులు హత్య యత్నం కేసును ఫైల్‌ చేశారు.తన వద్ద పని చేస్తున్న సచ్చిదానందం అనే వ్యక్తిని వినోద్‌ కుమార్‌ మరియు ఆయన స్నేహితుడు ఉదయ్‌లు చంపబోయారు.

తన వద్ద ఫైనాన్స్‌ విషయాలను గత కొన్ని సంవత్సరాలుగా చూస్తున్న సచ్చిదానందంను వినోద్‌ కుమార్‌ ఎందుకు చంపాలని భావించాడు అనేది ప్రస్తుతం ప్రశ్నార్థకంగా మారింది.సచ్చిదానందంను చంపి దాన్ని యాక్సిడెంట్‌గా చిత్రీకరించాలని వినోద్‌ కుమార్‌ మరియు ఆయన స్నేహితుడు ఉదయ్‌లు భావించారు.

కాని అది కాస్త రివర్స్‌ అవ్వడంతో ఇద్దరు కూడా ఇప్పుడు జైల్లో ఊచలు లెక్క బెడుతున్నారు.ఇంతకు సచ్చిదానందంను వినోద్‌ కుమార్‌ ఎందుకు చంపాలని భావించాడు అనే కోణంలో పోలీసులు ఎంక్వౌరీ చేస్తున్నారు.

Advertisement

అతి త్వరలోనే ఆ విషయం వెళ్లడయ్యే అవకాశాలున్నాయి.

Hajper Customer Support And Service Quality : A Practical Guide For UK Players
Advertisement