Chiranjeevi Suman : అరుదైన పురస్కారం అందుకున్న సీనియర్ నటుడు సుమన్!

తెలుగు సినిమా ఇండస్ట్రీలో చిరంజీవితో సమానంగా సినిమాలు చేస్తూ ఆగ్ర హీరోగా ఒకానొక సమయంలో ఓ వెలుగు వెలిగినటువంటి సుమన్ కొన్ని కారణాలవల్ల సినిమా అవకాశాలను పోగొట్టుకున్నారు.

అయితే ఈయన హీరోగా అవకాశాలు తప్పిపోయినప్పటికీ పలు సినిమాలలో కీలక పాత్రలలో నటిస్తూ ప్రేక్షకులను సందడి చేస్తున్నారు.

ఇలా తెలుగు సినిమా ఇండస్ట్రీలో నటుడిగా ఎంతో పేరు ప్రఖ్యాతలు సంపాదించుకున్న సీనియర్ నటుడు సుమన్ కు అరుదైన పురస్కారం లభించింది.తెలుగు చిత్ర పరిశ్రమలో ఎన్టీఆర్ ఏఎన్ఆర్ వంటి వారితో కలిసి సమానంగా నటించి పేరు ప్రఖ్యాతలు సంపాదించుకున్న నటుడు కాంతారావు శత జయంతి పురస్కారాన్ని అందుకోనున్నారు.

ఈ విషయాన్ని ప్రముఖ నిర్మాత తమ్మారెడ్డి భరద్వాజ్ వెల్లడించారు.హైదరాబాద్ జూబ్లీహిల్స్ లోని ఫిలిం ఛాంబర్ ప్రముఖ సంస్థ ఆకృతి ఆధ్వర్యంలో నిర్వహించిన సమావేశంలో భాగంగా తమ్మారెడ్డి భరద్వాజ్ ఈ విషయాన్ని వెల్లడించారు.

ఈ కార్యక్రమంలో భాగంగా తమ్మారెడ్డి మాట్లాడుతూ కాంతారావు ఎన్టీఆర్ ఏఎన్ఆర్ వంటి వారితో సమానంగా సినిమాలలో నటించారు.ఆయన తన సినీ కెరియర్ల సుమారు 400కు పైగా సినిమాలలో నటించి కళామతల్లికి ఎన్నో సేవలు చేశారు.డిసెంబర్ నెలలో రవీంద్ర భారతి వేదికగా కాంతారావు శతజయంతి సభను నిర్వహిస్తున్నట్లు ఈయన పేర్కొన్నారు.

Advertisement

ఈ వేడుకలో భాగంగా కాంతారావు శత జయంతి పురస్కారాన్ని నటుడు సుమన్ కు అందించనున్నారు.

సలార్ రిజల్ట్ పై ప్రశాంత్ నీల్ సంచలన వ్యాఖ్యలు.. ఆ విషయంలో సంతృప్తితో లేరా?
Advertisement

తాజా వార్తలు