ప్రస్తుతం కాలంలో ఒక సినిమా ఎంతో మంచి సక్సెస్ అయింది అంటే తప్పనిసరిగా ఆ సినిమాకు సీక్వెల్ సినిమా వస్తుంది.
ఇలా ఇటీవల కాలంలో ప్రేక్షకుల ముందుకు వస్తున్న సినిమాలన్నింటికీ కూడా సీక్వెల్ సినిమాలు ఉన్నాయి.
అయితే దాదాపు 15 సంవత్సరాల క్రితం ప్రేక్షకుల ముందుకు వచ్చినటువంటి సినిమాకు ప్రస్తుతం సీక్వెల్ రాబోతోంది.దర్శకుడు శేఖర్ కమ్ముల ( Sekhar Kammula ) దర్శకత్వంలో రానా ( Rana ) హీరోగా నటిస్తూ ఇండస్ట్రీకి పరిచయమైనటువంటి చిత్రం లీడర్.
పొలిటికల్ కుళ్ళుని ప్రశ్నిస్తూనే సమాజంలో పాతుకుపోయిన మంత్రుల అవినీతిని చూపించిన తీరు శభాష్ అనిపించుకుంది.
ఇలా రాజకీయాల నేపథ్యంలో ప్రేక్షకుల ముందుకు వచ్చినటువంటి ఈ సినిమా ఎంతో అద్భుతమైనటువంటి విజయాన్ని సొంతం చేసుకుంది.ఇకపోతే తాజాగా ఈ సినిమాకి సీక్వెల్ చిత్రం రాబోతుందని తెలుస్తోంది.ఎప్పటి నుంచో లీడర్ సీక్వెల్ ( Leader Sequel )కావాలని మూవీ లవర్స్ డిమాండ్ చేస్తున్నారు.
దానికి అనుగుణంగానే శేఖర్ కమ్ముల కథని సిద్ధం చేసే పనిలో ఉన్నారట.ప్రస్తుతం ఈయన నాగార్జున ( Nagarjuna ) ధనుష్ ( Danush )తో కలిసి ఒక మల్టీస్టారర్ సినిమా పనులలో బిజీగా ఉన్నారు.
ప్రస్తుతం ఏషియన్ బ్యానర్లో శేఖర్ కమ్ముల సినిమా చేస్తున్నారు.అయితే ఇదే ఏషియన్ బ్యానర్ కు మూడో కమిట్మెంట్ కూడా ఇచ్చారని తెలుస్తుంది.ఇదే విషయాన్ని నిన్న అధికారకంగా ప్రకటించారు.
దీంతో ఈ సినిమా సీక్వెల్ రాబోతుందని తెలుస్తుంది.మరి ఈ సినిమాలో నటీనటులు ఎవరు ఏంటి అనే విషయాలు మాత్రం తెలియడం లేదు.
రాష్ట్ర విభజన జరిగాక పరిస్థితుల్లో ఎన్నో మార్పులు వచ్చిన దృష్ట్యా వాటిని లీడర్ 2 లో చూపించబోతున్నట్టు తెలుస్తుంది.నాగార్జున ధనుష్ సినిమా పూర్తి అయిన తర్వాత ఈ సినిమా తెరపైకి రాబోతుందని తెలుస్తుంది.
తాజా వార్తలు
Download App
Channels
HomeEnglish NewsTeluguStop Exclusive StoriesFlash/Breaking NewsTrending NewsPoliticalMovieHealth TipsCrime NewsMovie ReviewsNRI NewsViral VideosBhakthi/DevotionalPress ReleasesViral StoriesQuotesPhoto TalksBaby Boy NamesBaby Girl NamesCelebrity ProfilesFollow Us!
Contact Us!
TeluguStop.com Media, Siya Residency, Sri Sri Circle, Khammam, Telangana- 507002info@telugustop.comPh No : 999-279-9973
About Us!
About UsJobsAdvertisingDMCA / RemovalTerms of UsePrivacy Policy