సీతారామం లో ఎక్కువ పేరు వచ్చేది ఆమెకేనా.!

హను రాఘవపుడి డైరక్షన్ లో దుల్కర్ సల్మాన్, మృణాల్ ఠాగూర్ లీడ్ రోల్స్ గా నటించిన సినిమా సీతారామం.

వైజయంతి మూవీస్ బ్యానర్ లో అశ్వనిదత్ నిర్మించిన ఈ సినిమా ఆగష్టు 5న ప్రేక్షకుల ముందుకు వస్తుంది.

ఈ సినిమా లో మరో స్టార్ హీరోయిన్ రష్మిక మందన్న కూడా ఇంపార్టెంట్ రోల్ ప్లే చేసింది.సినిమా ట్రైలర్ లో అసలు హీరోయిన్ మృణాల్ కన్నా రష్మిక పాత్రే హైలెట్ గా నిలిచేలా ఉందని తెలుస్తుంది.

సినిమాలో సీత పాత్రలో మృణాల్ నటిస్తుండగా అఫ్రీన్ పాత్రలో రష్మిక కనిపిస్తుంది.సీతారామం సినిమాలో దుల్కర్ సల్మాన్ ఆర్మీ ఆఫీసర్ గా కనిపిస్తున్నాడు.

సినిమాలో అక్కినేని ఫ్యామిలీ హీరో సుమంత్ కూడా ప్రాముఖ్యత కలిగిన పాత్రలో నటిస్తున్నారు.యుద్ధంతో రాసిన ప్రేమ కథ అంటూ క్రేజీ లవ్ స్టోరీగా వస్తుంది సీతారామం.

Advertisement
Seetha Ramam Highest Screen Space For Rashmika Not Mrinal , Dulquer Salman, Han

విశాల్ చంద్రశేఖర్ మ్యూజిక్ అందించిన ఈ సినిమాలోని సాంగ్స్ ఇప్పటికే సినిమాపై మంచి క్రేజ్ వచ్చేలా చేశాయి.సీతారామం సినిమాతో దుల్కర్ సల్మాన్ తెలుగులో తన మార్కెట్ పెంచుకోవాలని చూస్తున్నారు.

ఈ సినిమా తెలుగుతో పాటుగా తమిళ, మళయాళ భాషల్లో గ్రాండ్ గా రిలీజ్ అవుతుంది.

Seetha Ramam Highest Screen Space For Rashmika Not Mrinal , Dulquer Salman, Han

మహానటి సినిమాలో జెమిని గణేష్ పాత్రలో దుల్కర్ సల్మాన్ తన అద్భుతమైన నటనతో ప్రేక్షకులను మెప్పించారు.ఆ సినిమా టైం లోనే ఆయనకు డైరెక్ట్ తెలుగు ఆఫర్లు వచ్చాయి.అయితే సరైన కథతో చేయాలని ఇన్నాళ్లు ఆగారు.

ఈ క్రమంలో సీతారామం కథ పర్ఫెక్ట్ గా సెట్ అయ్యింది.ఈ సినిమాతో దుల్కర్ కంప్లీట్ గా తెలుగు హీరోగా ఇమేజ్ తెచ్చుకోవాలని చూస్తున్నారు.

చెవిటి వారు కాకూడ‌దంటే ఈ జాగ్ర‌త్త‌లు త‌ప్ప‌నిస‌రి!

 సినిమాకు యూత్ నుంచి విపరీతమైన పాజిటివ్ బజ్ ఏర్పడగా సినిమా ఖచ్చితంగా అంచనాలను అందుకుంటుందని ట్రేడ్ పండితులు చెబుతున్నారు.

Advertisement

తాజా వార్తలు