తులసి చర్మానికి ఎన్ని రకాలుగా పనికివస్తుందో చూడండి..

తులసి ప్రకృతి ఇచ్చిన గొప్ప వరం లాంటిది.వేల సంవత్సరాలుగా వైద్యరంగంలో ఒక అంతర్లీన భాగంగా ఉంటూ వస్తోంది తులసి.

మరి అలాంటి అద్భుత ఔషధాన్ని మనం ఇంట్లోనే పెంచుకుంటాం కాని సరిగా ఉపయోగించుకోవాలంటే మాత్రం బద్ధకం.కాస్త ఆ బద్దకాన్ని వీడి తులసిని చర్మ ఆరోగ్యానికి ఎలా ఉపయోగించుకోవాలో చూడండి.

See How Basil Leaves Can Help Your Skin Details, Basil Leaves, Tulasi, Tulasi Le

* చర్మం వదులుగా ఉంటే, తులసి బాగా ఉప్దయోగాపడుతుంది.తులసి ఆకులను 5 నిమిషాలపాటు మరిగించి,ఆ తరువాత దాంట్లోకి రోజ్ వాటర్ కలిపి, కొన్ని చుక్కల నిమ్మరసాన్ని కలిపి ఓ మిశ్రమాన్ని తయారు చేసుకోవచ్చు.

దీన్ని రోజు ముఖానికి పడితే మంచి ఫలితాలు కనిపిస్తాయి.* రక్తం క్లీన్ గా లేకపోతె కూడా రకరకాల ఇన్ఫెక్షన్స్ వస్తాయి.

Advertisement

అలాటప్పుడు రోజు తులసి ఆకులను తినే అలవాటు చేసుకోవాలి.రక్తం శుద్ధి చేయబడి చర్మం ఆరోగ్యాన్ని పొందుతుంది.

* దురదతో ఇబ్బందిపడేవారు కూడా తులసిని ఆశ్రయించవచ్చు.తులసి ఆకులను దంచి, దాంట్లోకి కొంచెం నిమ్మరసం కలుపుకొని దురద ఉన్న చోట పట్టాలి.

* చర్మం మీద ఇన్ఫెక్షన్స్ తో బాధపడేవారు ఆవనునేలోకి కొన్ని తులసి ఆకులని తీసుకొని, నూనె చిక్కబడే వరకు మరిగించి, ఆ తరువాత వడపోసి చర్మానికి రాసుకోవాలి.* తులసి ఆకులని కొబ్బరినూనెలో మరిగించి, చాలార్చిన తరువాత ఆ మిశ్రాన్ని కాలిన గాయాలపై ఉపశమనం కోసం రాసుకోవచ్చు.

మైదా పిండిని ఎలా తయారు చేస్తారు.. ఆరోగ్యానికి అది ఎందుకు మంచిది కాదు?
Advertisement

తాజా వార్తలు