కొత్తగా అర్జెంటీనాలో కవచంతో కూడిన డైనోసార్లను శాస్త్రవేత్తలు కనుగొన్నారు.. వివరాలివే!

డైనోసార్లు అనగానే మనకు భయంకరమైన జీవులు గుర్తుకు వస్తాయి.ఒకరకంగా సినిమాల వల్లనే డైనోసార్లు మనకి పరిచయం అయ్యాయని చెప్పుకోవచ్చు.

ఇవి కొన్ని కోట్ల సంవ‌త్స‌రాలు క్రితం అంత‌రించిపోయినప్పటికీ వాటి ఉనికి గురించిన ఆస‌క్తి మ‌నిషి మెదడులో నాటుకుపోయింది.ఈ క్రమంలోనే మరింత లోతైన పరిశోధనలు చేస్తున్నారు.

డైనోసార్లు అనగానే హాలీవుడ్లో అపుడెపుడో వచ్చిన జురాసిక్ పార్క్ సినిమా గుర్తుకు వస్తుంది.ఆ ఫేంటసీ ఫిలిం అప్పట్లో కాసుల వర్షం కురిపించింది.

ఇకపోతే తాజాగా అర్జెంటీనాలో క్రెటేషియస్ కాలానికి చెందిన ఒక చిన్న కవచంతో కూడిన డైనోసార్‌ను పాలియోంటాలజిస్టులు కనుగొన్నారు.అయితే ఈ డైనోసార్లు పెద్దవాటికి భిన్నంగా 1.5 మీటర్ల కంటే తక్కువ పొడవు, 4.5 నుండి 7 కిలోల బరువుని కలిగి ఉన్న‌ట్లు గుర్తించారు.జకపిల్ కనికురాను పరిశోధకులు వాటిని చిన్న థైరోఫోరాన్ డైనోసార్‌గా గుర్తిస్తున్నారు.

Advertisement

దీనికి సంబంధిచిన వివ‌రాల‌ను సైంటిఫిక్ రిపోర్ట్స్ జర్నల్‌లో తాజాగా ప్రకటించడంతో వెలుగు చూసింది.అర్జెంటీనాలో జకాపిల్ ఆవిష్కరణ దక్షిణ అర్ధగోళానికి పూర్తిగా కొత్త థైరోఫోరాన్ వంశాన్ని చూపుతుంది అని సదరు నివేదిక‌లో పేర్కొన్నారు.

ఈ డైనోసార్ శిలాజం అర్జెంటీనాలోని రియో ​​నీగ్రో ప్రావిన్స్‌లోని ఒక ఆనకట్ట సమీపంలో తవ్వకాలు జ‌ర‌ప‌గా బ‌య‌ట‌ప‌డింది.ఈ జకపిల్ కనికురాను అర్జెంటీనా పటగోనియా నుండి వచ్చిన మొదటి ఖచ్చితమైన థైరోఫోరాన్ జాతిగా పిలుస్తున్నారు.

అలాగే డైనోసార్‌లు గతంలో అనుకున్నదానికంటే చాలా విస్తృతమైన భౌగోళిక వ్యాప్తిని క‌లిగి ఉన్న‌ట్లు పరిశోధకులు ఈ సందర్భంగా తెలిపారు.దాదాపు 100 మిలియన్ సంవత్సరాల క్రితం డైనోసార్ నిటారుగా నడిచిందని అన్నారు.

ఇది థైరోఫోరాన్ డైనోసార్ సమూహంలో భాగమని పరిశోధకులు తెలిపారు.ఇందులో స్టెగోసారస్ అస్థి వెనుక పలకలు, స్పైకీ తోకను కలిగి ఉన్నట్లు తెలుస్తోంది.

న్యూస్ రౌండర్ టాప్ 20

డైనోసార్ల మూలం అధ్యయనంలో గోండ్వానన్ శిలాజానికి సంబంధించి ప్రాముఖ్యతను హైలైట్ చేస్తూ, జకాపిల్ ఆవిష్కరణ ప్రారంభ థైరోఫోరాన్ డైనోసార్ల కొత్త గోండ్వానాన్ వంశం ఉనికి ఉన్న‌ట్లు చెబుతుంద‌ని పరిశోధకులు ప్ర‌త్యేకంగా చెప్పడం గమనార్హం.

Advertisement

తాజా వార్తలు