పల్నాడు జిల్లాలో స్కూల్ బస్సు బోల్తా.. విద్యార్థులకు గాయాలు

పల్నాడు జిల్లాలో రోడ్డు ప్రమాదం జరిగింది.నరసరావుపేట సమీపంలో ప్రైవేట్ స్కూల్ బస్సు బోల్తా పడింది.

ఈ ప్రమాదంలో దాదాపు 15 మంది విద్యార్థులు గాయపడ్డారు.వెంటనే స్పందించిన స్థానికులు విద్యార్థులను బస్సు నుంచి బయటకు తీశారు.

అనంతరం బాధిత విద్యార్థులను హుటాహుటిన సమీప ఆస్పత్రికి తరలించారు.వీరిలో ఒక విద్యార్థి పరిస్థితి విషమంగా ఉంది.

అయితే పామిడిమర్రు నుంచి నరసరావుపేట వెళ్తున్న సమయంలో రోడ్డుపై అడ్డుగా ఉన్న వాహనాన్ని తప్పించబోయిన స్కూల్ బస్సు కాలువలో బోల్తా పడిందని తెలుస్తోంది.బస్సు డ్రైవర్ ను అదుపులోకి తీసుకున్న పోలీసులు విచారణ చేస్తున్నారు.

Advertisement
Betfair Review And Player Reputation (UK) : An Analytical Guide