జూలై 17వ తేదీన వచ్చే శ్రావణ అమావాస్య రోజు.. ఈ చెట్లు నాటమని చెబుతున్న పండితులు..!

మన దేశంలో చాలా మంది ప్రజలు చాలా రకాల సంప్రదాయాలను పాటిస్తూ ఉంటారు.

ముఖ్యంగా చెప్పాలంటే శ్రావణ అమావాస్య రోజును చాలా మంది ప్రజలు ఎంతో ప్రాముఖ్యతతో జరుపుకుంటారు.

ముఖ్యంగా చెప్పాలంటే ఈ సంవత్సరం జూలై నెలలో శ్రావణ అమావాస్య రాబోతుంది.ఖచ్చితంగా చెప్పాలంటే శ్రావణ అమావాస్య( Shravana Amavasya ) జూలై 17వ తేదీన వస్తుంది.

ఈ రోజున చాలా మంది ప్రజలు బాగా వర్షాలు కురిసి పంటలు సమృద్ధిగా పండాలని దేవతలకు ప్రార్ధనలు చేస్తారు.

ఈ రోజు న శివుడి( Lord shiva )ని పూజించడం అత్యంత పవిత్రమైనదిగా ప్రజలు భావిస్తారు.అంతే కాకుండా శ్రావణ అమావాస్య రోజున పితృదేవతలకు పిండ ప్రధానం కూడా చేస్తారు.ముఖ్యంగా చెప్పాలంటే శ్రావణ మాసం నుంచి రుతుపవనాలు మొదలవడంతో పంటలు సమృద్ధిగా పడేందుకు పచ్చగా మారుతాయి.

Advertisement

అలాగే మరి కొంత మంది ప్రజలు ఈ రోజున ఉపవాసం పాటిస్తారు.ఇంకా చెప్పాలంటే ఈ రోజు ఉదయం పూట పవిత్రమైన నది, సరస్సు లేదా చెరువులో స్నానం చేయాలి.

అలాగే సూర్య భగవానుడి( Lord surya )కి అర్ఘ్యం సమర్పించాలి.ఆ తర్వాత పితృదేవతలకు తర్పణం సమర్పించాలి.అలాగే ఉపవాసం ఉండి పితృదేవతలకు అన్నం సమర్పించి పేదలకు అన్నదానం, వస్తువులను దానం చేయడం ఎంతో మంచిది.

ముఖ్యంగా చెప్పాలంటే ఈ రోజు న రావి చెట్టు ప్రదక్షణ కూడా మంచి ఫలితాన్ని ఇస్తుంది.అంతే కాకుండా శ్రావణ అమావాస్య రోజు రావి, మర్రి, నిమ్మ, అరటి, తులసి మొదలైన చెట్లను నాటడం శుభప్రదం అని పండితులు చెబుతున్నారు.

ఎందుకంటే ఈ చెట్లలో దేవతలు నివసిస్తారని పెద్దవారు చెబుతూ ఉంటారు.

తెలుగు రాశి ఫలాలు, పంచాంగం – నవంబర్6, బుధవారం2024
Advertisement

తాజా వార్తలు