సోషల్ మీడియాలో పోస్ట్‌లను, మెసేజ్‌లను షెడ్యూల్ చేయడం వల్ల ఎన్నో ప్రయోజనాలు ఉన్నాయి.
ఏవైనా విషయాలను ప్లాన్ చేయడం, పోస్ట్‌లకు ప్రాధాన్యత ఇవ్వడం వంటివి దీని వల్ల సాధ్యం అవుతాయి.
ఫేస్ బుక్, ట్విట్టర్‌లలో నేరుగా పోస్ట్‌లను షెడ్యూల్ చేయడానికి యూజర్లకు అవకాశం ఉంది.అయితే ఇన్‌స్టాగ్రామ్‌లో Hootsuite వంటి థర్డ్ పార్టీ సైట్‌లు ఉపయోగపడతాయి.
అయితే వాట్సాప్‌లో డైరెక్ట్‌గా మెసేజ్‌లను షెడ్యూల్ చేయాలనుకుంటే మాత్రం అవకాశం లేదు.మెటా యాజమాన్యంలోని ఈ ఇన్‌స్టంట్ మెసేజింగ్ యాప్ నుండి నేరుగా పోస్ట్‌లను షెడ్యూల్ చేయడానికి ప్రస్తుతానికి ఎలాంటి ఫీచర్ లేకపోయినా, ఇందుకు సాయపడే కొన్ని థర్డ్-పార్టీ యాప్‌లు ఉన్నాయి.
దీనికి సంబంధించిన ఆసక్తికర విషయాలిలా ఉన్నాయి.వాట్సాప్‌లో మెసేజ్‌లు షెడ్యూల్ చేసుకునేందుకు వాట్సాప్ షెడ్యూలర్, డూ ఇట్ లేటర్, SKEDit వంటి థర్డ్ పార్టీ యాప్‌లు అందుబాటులో ఉన్నాయి.
వీటి ద్వారా మెసేజ్‌లు, ఫోటోలు, వీడియోలను షెడ్యూల్ చేయడానికి యూజర్లకు ఉపయోగపడతాయి.మీరు వ్యాపారం కోసం వాట్సాప్ ఉపయోగిస్తుంటే పండుగలు, పుట్టినరోజుల కోసం శుభాకాంక్షలు పోస్ట్‌లను ప్లాన్ చేస్తే మీరు పోస్ట్‌లను షెడ్యూల్ చేయవచ్చు.
వాట్సాప్ మెసేజ్‌లను షెడ్యూల్ చేసుకునేందుకు గూగుల్ ప్లే స్టోర్, యాపిల్ ప్లే స్టోర్‌లో మీరు SKEDitని ఉపయోగించుకోవచ్చు.ముందుగా యాపిల్ ప్లే స్టోర్ లేదా గూగుల్ ప్లే స్టోర్‌కి వెళ్లి SKEDit కోసం సెర్చ్ చేయండి.
యాప్‌ను డౌన్‌లోడ్ చేయండి.Facebookని ఉపయోగించి సైన్-అప్ చేయండి.లేనిపక్షంలో కొత్త అకౌంట్ క్రియేట్ చేయండి.
ఇప్పుడు మీ పేరు, ఇ-మెయిల్, పాస్‌వర్డ్‌ను నమోదు చేసి, క్రియేట్ అకౌంట్ క్లిక్ చేయండి.తర్వాత మీ మెయిల్‌కి వచ్చిన కోడ్‌ను యాడ్ చేసి, మెయిల్‌ను ధ్రువీకరించాలి.
దీని తర్వాత ధృవీకరణ తర్వాత, మీరు యాడ్ సర్వీసెస్ పేజీని చూస్తారు.వాట్సాప్ పై క్లిక్ చేయండి.
SKEDitను వాట్సాప్ ప్రాంప్ట్ అనుమతి కోసం ఓకే చేయండి.ఇప్పుడు మీరు మెసేజ్‌ను షెడ్యూల్ చేయాలనుకుంటున్న వాట్సాప్ కాంటాక్ట్‌ను ఎంచుకోండి.
అన్ని వివరాలు, తేదీ, సమయం, షెడ్యూల్‌ను యాడ్ చేయండి.షెడ్యూల్ చేయబడిన రోజున మీరు పంపాలనుకున్న వారికి మెసేజ్ వెళ్తుంది.
తాజా వార్తలు
Download App
Channels
HomeEnglish NewsTeluguStop Exclusive StoriesFlash/Breaking NewsTrending NewsPoliticalMovieHealth TipsCrime NewsMovie ReviewsNRI NewsViral VideosBhakthi/DevotionalPress ReleasesViral StoriesQuotesPhoto TalksBaby Boy NamesBaby Girl NamesCelebrity ProfilesFollow Us!
Contact Us!
TeluguStop.com Media, Siya Residency, Sri Sri Circle, Khammam, Telangana- 507002info@telugustop.comPh No : 999-279-9973
About Us!
About UsJobsAdvertisingDMCA / RemovalTerms of UsePrivacy Policy