ఈ సింపుల్ రెమెడీతో పసుపు దంతాలకు చెప్పండి గుడ్ బై..!

సాధారణంగా కొందరి దంతాలు తెల్లగా కాకుండా పసుపు రంగులో ఉంటాయి.

ఆహారపు అలవాట్లు, దంత సంరక్షణ లేకపోవడం, కాఫీ టీ కూల్ డ్రింక్స్ వంటి పానీయాలు అధికంగా తీసుకోవడం, స్మోకింగ్, పలు రకాల మందుల వాడకం తదితర కారణాల వల్ల దంతాలు పసుపు రంగులోకి మారిపోతూ ఉంటాయి.

అటువంటి దంతాలతో మీరు బాధపడుతున్నారా.? దంతాలను తెల్లగా ముత్యాల మాదిరి మెరిపించుకోవాలని భావిస్తున్నారా.? అయితే అందుకు ఇప్పుడు చెప్పబోయే హోమ్ రెమెడీ చాలా బాగా సహాయపడుతుంది.ఈ రెమెడీ తో సులభంగా పసుపు దంతాలకు గుడ్ బై చెప్పవచ్చు.

అందుకోసం ముందుగా ఒక బౌల్ తీసుకొని అందులో హాఫ్ టేబుల్ స్పూన్ లవంగాల పొడిని( Clove powder ) వేసుకోవాలి.అలాగే హాఫ్ టేబుల్ స్పూన్ ఫ్రెష్ అల్లం తురుము( Grate ginger ) లేదా అల్లం పొడి, హాఫ్ టేబుల్ స్పూన్ సాల్ట్ మరియు వన్ టేబుల్ స్పూన్ వైట్ టూత్ పేస్ట్ ( White toothpaste )వేసుకుని అన్నీ కలిసేలా బాగా మిక్స్ చేసుకోవాలి.

ఇలా తయారు చేసుకున్న మిశ్రమాన్ని బ్రష్ సహాయంతో దంతాలకు అప్లై చేసుకుని రెండు నుంచి మూడు నిమిషాల పాటు తోముకోవాలి.ఆపై గోరువెచ్చని వాటర్ తో దంతాలను మరియు నోటిని శుభ్రంగా క్లీన్ చేసుకోవాలి.రోజుకి ఒక్కసారి ఈ సింపుల్ హోమ్ రెమెడీని కనుక పాటించారంటే దంతాలపై ఏర్పడిన పసుపు మరకలు క్రమంగా మాయమవుతాయి.

Advertisement

దంతాలు తెల్లగా మారతాయి.

అలాగే లవంగాలు అల్లం లో ఉండే పలు సుగుణాలు చిగుళ్ళ ఆరోగ్యానికి అండగా ఉంటాయి.చిగుళ్ళ వాపు( Inflammation of the gums ), చిగుళ్ళ నుంచి రక్తస్రావం వంటి సమస్యలు దూరం అవుతాయి.దంతాలు, చిగుళ్ళు ఆరోగ్యంగా మరియు దృఢంగా మారతాయి.

కాబట్టి పసుపు దంతాలతో బాధపడుతున్న వారు, ముత్యాల్లాంటి మెరిసే దంతాలను కోరుకునేవారు తప్పకుండా ఇప్పుడు చెప్పుకున్న హోమ్ రెమెడీని ప్రయత్నించండి.మంచి రిజల్ట్ మీ సొంతం అవుతుంది.

పొట్టలో గ్యాస్ నిండిపోయి ఉబ్బరంగా ఉందా.. అయితే ఇలా చేయండి..!
Advertisement

తాజా వార్తలు