ఈ పవర్ ఫుల్ రెమెడీతో పసుపు దంతాలకు చెప్పండి గుడ్ బై..!

సాధారణంగా కొందరి దంతాలు పసుపు రంగులో కనిపిస్తుంటాయి.

దంత సంరక్షణ లేకపోవడం, ఆహారపు అలవాట్లు, స్మోకింగ్ తదితర కారణాల వల్ల దంతాలు ( teeths )పసుపు రంగులోకి మారి అసహ్యంగా కనిపిస్తుంటాయి.

ఇటువంటి దంతాలను తెల్లగా మెరిపించుకునేందుకు ఎంతో ఖరీదైన టూత్ పేస్ట్ లను వినియోగిస్తూ ఉంటారు.అయినా సరే ఫలితం అంతంత మాత్రంగా ఉంటే ఏం చేయాలో తెలియక మదన పడుతూ ఉంటారు.

మీరు ఈ జాబితాలో ఉన్నారా.? అయితే ఇప్పుడు చెప్పబోయే పవర్ ఫుల్ హోమ్ రెమెడీ మీకు ఉత్తమంగా సహాయపడుతుంది.ఈ రెమెడీని ఫాలో అయ్యారంటే పసుపు దంతాలకు సులభంగా మరియు వేగంగా గుడ్ బై చెప్పవచ్చు.

మరి ఇంకెందుకు ఆలస్యం ఆ రెమెడీ ఏంటో తెలుసుకుందాం పదండి.

Advertisement

ముందుగా ఒక బౌల్ తీసుకొని అందులో వన్ టీ స్పూన్ అల్లం పొడి ( Tea spoon ginger powder )వేసుకోవాలి.అలాగే వన్ టీ స్పూన్ లవంగాల పొడి( Clove powder ), పావు టీ స్పూను పసుపు,( Turmaric ) రెండు టీ స్పూన్లు వైట్ టూత్ పేస్ట్‌ మరియు హాఫ్ టీ స్పూన్ వాటర్ వేసుకుని బాగా మిక్స్ చేసుకోవాలి.ఇప్పుడు ఈ మిశ్రమాన్ని ఒక బాక్స్ లో నింపుకుని స్టోర్ చేసుకోవాలి.

రోజు ఉదయం ఈ మిశ్రమాన్ని ఉపయోగించి దంతాలను రెండు నుంచి మూడు నిమిషాల పాటు బాగా తోముకోవాలి.ఆపై వాటర్ తో శుభ్రంగా దంతాలను మరియు నోటిని క్లీన్ చేసుకోవాలి.

ఈ విధంగా బ్రష్ చేసుకోవడం వల్ల దంతాలపై ఏర్పడిన పసుపు మరకలు తొలగిపోతాయి.దంతాలు తెల్లగా కాంతివంతంగా మారతాయి.అలాగే పైన చెప్పిన హోమ్ రెమెడీని పాటించడం వల్ల దంతాల పోటు, దంత క్షయం వంటి సమస్యలు ఇబ్బంది పెట్టకుండా ఉంటాయి.

అంతేకాకుండా ఈ రెమెడీ చిగుళ్ల వాపు, చిగుళ్ల నుంచి రక్తస్రావం వంటి సమస్యలకు సైతం అడ్డుకట్ట వేస్తుంది.కాబట్టి పసుపు దంతాలతో బాధపడుతున్న వారు తప్పకుండా ఇప్పుడు చెప్పుకున్న హోమ్ రెమెడీని ప్రయత్నించండి.

అల్లు అర్జున్ కి ఇష్టమైన సినిమా ఏంటో తెలుసా..? ఆ సినిమాను ఇప్పటి వరకు ఎన్ని సార్లు చూశాడంటే..?
Advertisement

తాజా వార్తలు