ఈ రెమెడీతో చెప్పండి పిగ్మెంటేషన్ కు బై బై..!

స్కిన్ పిగ్మెంటేషన్( Skin pigmentation ).చాలా మందిని ఇబ్బంది పెట్టే సమస్యల్లో ఒకటి.

స్కిన్ పిగ్మెంటేషన్ మూడు ర‌కాలుగా ఉంటుంది.హైపర్‌పిగ్మెంటేషన్, హైపోపిగ్మెంటేషన్ మ‌రియు డిపిగ్మెంటేషన్.

పిగ్మెంటేష‌న్ వ‌ల్ల డార్క్ స్పాట్స్, లైట్ స్పాట్స్‌, తెల్ల మచ్చలు లేదా పాచెస్ ఏర్ప‌డి స్కిన్ క‌ల‌ర్ అనేది అన్ఈవెన్ గా మారిపోతుంది.హార్మోన్ల మార్పులు, ఏజ్, ఎండ‌ల ప్ర‌భావం, కొన్ని ర‌కాల మందుల వాడ‌కం, రసాయనాలతో కూడిన స్కిన్ కేర్ ప్రొడక్ట్స్‌ ను వాడ‌టం త‌దిత‌ర కార‌ణాల వ‌ల్ల స్కిన్ పిగ్మెంటేషన్ ను ఫేస్ చేయాల్సి ఉంటుంది.

అయితే ఈ ప్రాబ్లం నుంచి బయటపడడం కోసం రకరకాల ప్ర‌య‌త్నాలు చేస్తుంటారు.అయితే ఇప్పుడు చెప్పబోయే పవర్ ఫుల్ రెమెడీ వారి కోసమే.

Advertisement
Say Goodbye To Pigmentation With This Home Remedy! Home Remedy, Pigmentation, Sk

ముందుగా మిక్సీ జార్ తీసుకుని అందులో రెండు రెబ్బలు వేపాకు వేసుకోవాలి.అలాగే పావు కప్పు చెట్టు నుంచి తీసిన ఫ్రెష్ అలోవెరా జెల్ ( Fresh aloe vera gel )మరియు మూడు టమాటో స్లైసెస్ ( Tomato slices )వేసుకొని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి.

ఇలా గ్రైండ్ చేసుకున్న మిశ్రమం నుంచి స్ట్రైనర్ సహాయంతో జ్యూస్ ను సపరేట్ చేసుకోవాలి.

Say Goodbye To Pigmentation With This Home Remedy Home Remedy, Pigmentation, Sk

ఇప్పుడు ఈ జ్యూస్ లో రెండు టేబుల్ స్పూన్లు బియ్యం పిండి( rice flour ), వన్ టీ స్పూన్ స్వచ్ఛమైన తేనె వేసుకుని బాగా మిక్స్ చేసుకోవాలి.ఈ మిశ్రమాన్ని ముఖంతో పాటు మెడకు కూడా అప్లై చేసుకుని 20 నిమిషాల పాటు ఆరబెట్టుకోవాలి.ఆపై వాటర్ తో శుభ్రంగా చర్మాన్ని క్లీన్ చేసుకొని మాయిశ్చరైజర్ ను రాసుకోవాలి.

వారానికి రెండుసార్లు ఈ రెమెడీని కనుక పాటిస్తే పిగ్మెంటేషన్ కు గురైన చర్మం మళ్లీ సాధారణ స్థితికి చేరుతుంది.స్కిన్ కలర్ ఈవెన్ మారుతుంది.

Say Goodbye To Pigmentation With This Home Remedy Home Remedy, Pigmentation, Sk
వారంలో 2 సార్లు ఈ రెమెడీని ట్రై చేస్తే మెడ న‌లుపు మాయం!

అలాగే ఈ రెమెడీ చర్మాన్ని లోతుగా శుభ్రం చేస్తుంది.చర్మ కణాల్లో పేరుకుపోయిన మురికి మృతకణాలను తొలగిస్తుంది.చర్మ ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది.

Advertisement

కాంతివంతమైన చర్మాన్ని ప్రోత్సహిస్తుంది.అంతేకాకుండా మొండి మొటిమలు, మచ్చల చికిత్సలోనూ ఈ రెమెడీ ఉత్తమంగా సహాయపడుతుంది.

కాబట్టి తప్పకుండా ప్రయత్నించండి.

తాజా వార్తలు