అంజలీదేవికి సావిత్రి శిష్యురాలు.. అంజలి సినిమా కోసం ఏం చేసిందంటే..?

టాలీవుడ్ ఇండస్ట్రీలో ఫస్ట్ గ్లామరస్ హీరోయిన్ గా అంజలీదేవి( Anjalidevi ) పేరు తెచ్చుకుంది.తొలి స్టార్ హీరోయిన్‌గా సావిత్రి( Savitri ) అవతరించింది.

అయితే అంజలీదేవికి సావిత్రి ఏకలవ్య శిష్యురాలు అని అంటుంటారు.ఇలా ఎవరిని అంటారో మనకి ఒక ఐడియా ఉంది.

ఏకలవ్యుడు తన గురు ద్రోణాచార్యుని వద్ద గురుదక్షిణగా తన కుడిచేతి బొటనవేలు అర్పిస్తాడు, ఆపై సెల్ఫ్ ట్రైనింగ్ తీసుకుని, ఒక గొప్ప ధనుర్ధారిగా ఎదిగాడు.ఇలాంటి లక్షణాలు ఉన్న వారిని అందరిని ఏకలవ్య శిష్యులు అని అంటుంటారు.

సావిత్రి కూడా అంజలీదేవిని ఒక గురువుగా భావించేది.ఆమె సినిమాలు తప్పకుండా చూసేది.అంజలి లాగా హీరోయిన్ కావాలనుకుంది.

Advertisement
Savitri Is Admired Anjali Devi Details, Anjali Devi, Savitri, Mahanati Savitri,

గొల్లభామ సినిమాలో( Gollabhama Movie ) అంజలి చేసిన డాన్సులు సావిత్రి స్టేజిల మీద పర్ఫార్మ్ చేసేది.వీరిద్దరూ తొలిసారిగా "చరణదాసి" ( Charana Daasi ) సినిమాలో స్క్రీన్ షేర్ చేసుకున్నారు.

టి.ప్రకాశరావు దర్శకత్వంలో ఎన్టీఆర్, ఏఎన్నార్ లాంటి నటదిగ్గజాలు నటించిన ఈ సినిమా బాగానే ఆడింది.1956లో ఈ మూవీ రిలీజ్ అయింది.సావిత్రి, అంజలి ఈ సినిమాలో అద్భుతంగా నటించి ప్రేక్షకుల చేత చప్పట్లు కొట్టించుకున్నారు.

Savitri Is Admired Anjali Devi Details, Anjali Devi, Savitri, Mahanati Savitri,

ఆ రోజుల్లో ఒక్క సావిత్రి మాత్రమే కాదు జమున, కృష్ణకుమారి లాంటి అగ్ర హీరోయిన్లు కూడా అంజలీదేవిని బాగా అభిమానించేవారు.అంతే కాదు అక్క అక్కా అంటూ అంజలి చుట్టూ తిరిగేవారు.అప్పట్లో అంజలి దేవి "అమ్మకోసం"( Ammakosam Movie ) సినిమా నిర్మించారు.

ఈ మూవీ ప్రారంభోత్సవానికి ఎన్టీఆర్ తో( NTR ) సహా సావిత్రి కూడా ముఖ్యఅతిథిగా విచ్చేసింది.ఈ సినిమాలోని అంజలీదేవిపై ప్రారంభమైన తొలి షాట్‌కు సావిత్రి నే తొలి క్లాప్ కొట్టింది.

Savitri Is Admired Anjali Devi Details, Anjali Devi, Savitri, Mahanati Savitri,
వారంలో 2 సార్లు ఈ రెమెడీని ట్రై చేస్తే మెడ న‌లుపు మాయం!

వీరి మధ్య స్నేహం అనేది బాగా కుదిరింది.1967లో వచ్చిన సతీసమతి సినిమా ద్వారా వీరు మరొకసారి కలిసిన నటించారు.ఉమ్మడి కుటుంబంపై వచ్చిన "ఆదర్శ కుటుంబం (1969)" సినిమాలో సావిత్రి, అంజలి, వరలక్ష్మి, జయలలిత వంటి అగ్ర నటీమణులు అందరూ కలిసి నటించి ఎంతగానో ఆకట్టుకున్నారు.

Advertisement

ఇందులో అక్కినేని నాగేశ్వరరావు హీరో.డైరెక్టర్ త్రివిక్రమ రావు దీనిని తీశాడు.అలా సావిత్రి, అంజలి కలిసి సినిమాలు చేస్తూ ఒక తల్లి కడుపున పుట్టిన బిడ్డల్లాగా మెలిగే వారు.

అంజలి నటన నుంచి కూడా సావిత్రి చాలా మెలకువలు నేర్చుకున్నట్లు చెబుతారు.తర్వాత తనకు తానే నటనలో ఎన్నో గొప్ప విషయాలు తెలుసుకునే సావిత్రి మహానటి అయిపోయింది.

టాలీవుడ్ ఇండస్ట్రీలో అంజలీదేవి తర్వాత మళ్లీ అంతటి పేరు ఒక్కసారి సావిత్రి కే దక్కిందని చెప్పుకోవచ్చు.

తాజా వార్తలు