మరో రేర్ ఫీట్‌కు రెడీ అవుతోన్న సరిలేరు నీకెవ్వరు

సూపర్ స్టార్ మహేష్ బాబు నటించిన తాజా చిత్రం సరిలేరు నీకెవ్వరు సంక్రాంతి కానుకగా జనవరి 11న ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్ రిలీజ్ అయ్యింది.

ఈ సినిమాలో మహేష్ ఆర్మీ మేజర్ పాత్రలో నటించడంతో ఔట్ అండ్ ఔట్ యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా ఈ సినిమా తెరకెక్కింది.

ఇక ఈ సినిమాను దర్శకుడు అనిల్ రావిపూడి పూర్తి కమర్షియల్ అంశాలతో తెరకెక్కించడంతో మాస్ వర్గాల్లో ఈ సినిమా అదిరిపోయే రెస్పాన్స్ దక్కించుకుంటుందని చిత్ర యూనిట్ ధీమా వ్యక్తం చేసింది.ఇక రిలీజ్ రోజునే ఈ సినిమాకు మంచి టాక్ సొంతం కావడంతో ఈ సినిమాను చూసేందుకు జనం ఎగబడ్డారు.

కాగా ఈ సినిమాతో మహేష్ కొన్ని సరికొత్త రికార్డులను తన పేరిట నమోదు చేసుకున్నాడు.ఇక ఈ సినిమా కలెక్షన్ల పరంగా ప్రస్తుతం నెమ్మదించిన సంగతి తెలిసిందే.

అయితే ఈ సినిమాకు సంబంధించి మరో అరుదైన వేడుకను చిత్ర యూనిట్ నిర్వహించేందుకు రెడీ అవుతోంది.ఈ సినిమా 50 రోజులు పూర్తి చేసుకోనున్న సంద్భంగా 50 డేస్ ఫంక్షన్‌ను చిత్ర యూనిట్ ఘనంగా నిర్వహించేందుకు రెడీ అవుతున్నారు.

Advertisement

ఈ వేడుకను ఎప్పుడు ఎక్కడ నిర్వహిస్తారనే అంశంపై ఇంకా క్లారిటీ రావాల్సి ఉంది.ఇటీవల కాలంలో 50 రోజులు పూర్తి చేసుకున్న సినిమాల సంఖ్య చాలా తక్కువ.

దీంతో మహేష్ మరో అరుదైన ఫీట్ సాధించడంతో ఆయన ఫ్యాన్స్ పండగ చేసుకుంటున్నారు.అనిల్ రావిపూడి డైరెక్ట్ చేసిన ఈ సినిమాలో రష్మిక మందన హీరోయిన్‌గా నటించగా, లేడీ సూపర్ స్టార్ విజయశాంతి రీఎంట్రీ ఇచ్చిన సంగతి తెలిసిందే.

Advertisement

తాజా వార్తలు