దేవుడి ప్రసాదం అని అక్షయ్ కుమార్ పై ట్రిక్.. చివరికి ఏం జరిగిందంటే?

ఆనంద్ ఎల్ రాయ్ దర్శకత్వంలో బాలీవుడ్ హీరో అక్షయ్ కుమార్, బాలీవుడ్ బ్యూటీ సారా అలీ ఖాన్, అలాగే కోలీవుడ్ స్టార్ హీరో ధనుష్ ముగ్గురు కలిసి నటించిన తాజా చిత్రం ఆత్రంగి రే.

ఈ సినిమా గత ఏడాది డిసెంబర్ 24 న క్రిస్మస్ పండుగ కానుకగా విడుదలైన విషయం అందరికి తెలిసిందే.

ఈ సినిమా థియేటర్లలో విడుదల అయ్యి మంచి సూపర్ హిట్ టాక్ ను అందుకుంది.ఇక ఈ సినిమా ప్రమోషన్స్ లో భాగంగా చిత్ర బృందం డిసెంబర్ లో ప్రముఖ హిందీ టాక్ షో అయిన ది కపిల్ శర్మ షోలో సందడి చేశారు హీరో అక్షయ్ కుమార్ అలాగే సారా అలీ ఖాన్.

ఈ క్రమంలోనే ఆ షోలో సినిమా చిత్రీకరణ సమయంలో జరిగిన సన్నివేశాలు, పలు విషయాల గురించి ముచ్చటించి సందడి సందడి చేశారు.సినిమాకు సంబంధించిన విషయాలను తనదైన శైలిలో ప్రశ్నలు వేస్తూ సమాధానాలు రాబట్టాడు కపిల్ శర్మ.

ఈ క్రమంలోనే అక్షయ్ కుమార్ తనపై ఎలాంటి ట్రిక్ ను ప్లే చేశాడు చెప్పుకొచ్చింది సారా అలీ ఖాన్.అప్పుడు నేను నీ మీద ఏం ట్రిక్ ప్లే చేశాను అని అక్షయ్ కుమార్ అడగగా.

Advertisement
Sara Ali Khan Fed Garlic To Akshy Kumar In The Name Of Prasadam Details, Sara Al

సార్ మీరు నాకు స్వీట్ అని చెప్పి వెల్లుల్లి తినిపించారు.అది కూడా దేవుడి ప్రసాదం అని చెప్పి మీరు.

బేటా దేవుడి ప్రసాదం అని అన్నారు.మీరు ఇచ్చినది వండిన వెల్లుల్లి కూడా కాదు.

పచ్చి వెల్లుల్లి అని తెలిపింది సారా అలీ ఖాన్.

Sara Ali Khan Fed Garlic To Akshy Kumar In The Name Of Prasadam Details, Sara Al

వెంటనే అక్షయ్ కుమార్ ఆ విషయంపై స్పందిస్తూ అది నిన్ను బాధ పెట్టింద అని అడగగా.అవును అది కొంచెం నాకు అనారోగ్యంగా అనిపించింది అని చెప్పుకొచ్చింది సారా.ఈ మాటతో నువ్వు తిన్నట్లు నీ కెరీర్ పై ప్రమాణం చేసి చెప్పు అని అడగగా.

రోజూ రాత్రి ఇలా చేస్తే కనుబొమ్మలు ఒత్తుగా పెరుగుతాయ‌ట‌..తెలుసా?

నేను దాన్ని తింటే కచ్చితంగా అనారోగ్యంగా అనిపించేది అంటూ బదులిచ్చింది సారా అలీ ఖాన్.దీంతో అక్కడున్న వారంతా ఒక్కసారిగా పళ్ళు మని నవ్వారు.అలా ఆ షోలో సారా, అక్షయ్ కుమార్, కపిల్ శర్మ ముగ్గురు కలసి సందడి సందడి చేశారు.

Advertisement

తాజా వార్తలు