టెక్నాలజీ ని వాడుకుంటున్న పందెం రాయుళ్లు,ఆన్ లైన్ లో అమ్మకాలు

నాగరికతలో ఎన్ని మార్పులు వచ్చినా కూడా కొన్ని కొన్ని సంప్రదాయాలు మాత్రం కొనసాగుతూనే ఉన్నాయి.వాటిల్లో ప్రధానంగా చెప్పుకొనేది సంక్రాంతి పండుగ నెలలో కోడి పందేలు.

ఈ కోడి పందేలు అనేవి ఎప్పటినుంచో సంప్రదాయంగా వస్తున్నాయి.అందుకే ప్రతి ఒక్కరూ కూడా ఈ కోడి పందేలు చూడడానికి,కాయడానికి ఆసక్తి కనబరుస్తూ ఉంటారు.

అయితే ఈ కోడి పందేలు అనేవి ఒక వ్యసనంగా మారి భారీ ఎత్తున బెట్టింగులు చేస్తుండడం తో వాటిని బ్యాన్ చేయాలనీ అధికారులు భావిస్తున్నారు.

Sankranthi Roosters In Online

అయితే ఇప్పుడు టెక్నాలజీ పెరగడం తో పందెం రాయుళ్లు కూడా ఆ టెక్నాలజీ ని వాడుకుంటూ తమ బెట్టింగులు కొనసాగిస్తున్నారు.ఈ క్రమంలోనే ఉభయ గోదావరి జిల్లాల్లో ఆన్ లైన్ లో పందెం కోళ్ల అమ్మకాలు జరుపుతున్నట్లు తెలుస్తుంది.యజమానులు తమ ఇంటి వద్ద నుంచే పందెంకోళ్ల ఫోటోలు, ధరలను తెలుపుతూ.

Advertisement
Sankranthi Roosters In Online-టెక్నాలజీ ని వాడు�

అంతర్జాలంలో అమ్ముకుంటున్నారు.జిల్లాలోని ఏలూరు, భీమవరం, నరసాపురం ప్రాంతాల్లోని కోళ్ల పెంపకందారులు ఈ కొత్తరకం స్టైల్ లో తమ కోళ్ల ను అమ్మకాలను సాగిస్తున్నారు.

ఇక ఏపీతో పాటు కేరళ, కర్నాటక, గోవాకు చెందిన వాళ్లే ఎక్కువగా ఈ పందెం కోళ్లను సామాజిక మాధ్యమాల ద్వారా కొనుగోలు చేస్తున్నట్లు తెలుస్తుంది.

Sankranthi Roosters In Online

అటు ఒక్కో పుంజును జాతిని బట్టి వెయ్యి నుంచి రూ.5 వేల వరకు అమ్ముతున్నట్లు సమాచారం.ముఖ్యంగా వీటిని OLX, ఫేస్‌బుక్‌లో ఫోటోలు పోస్ట్ చేసి తమ ఫోన్‌ నెంబర్ల ద్వారా బేరసారాలు సాగిస్తున్నారట.

నిజంగా టెక్నాలజీ అభివృద్ధి చెందుతుంది అని అంటుంటే ఇలాంటి వాటికి కూడా ఈ టెక్నాలజీ నే ఉపయోగించి టెక్నాలజీ అంటేనే భయ పడేటట్లు చేస్తున్నారు కొందరు జనాలు.

ఫూల్ మఖనా తినడం వలన ఇన్ని లాభాలు ఉన్నాయా..?
Advertisement

తాజా వార్తలు