సుదీప్ అభిమానించే టాలీవుడ్ స్టార్ హీరో ఎవరంటే..?

శాండిల్ వుడ్ ఇండస్ట్రీలో స్టార్ హీరోగా, రచయితగా, నిర్మాతగా, బిగ్ బాస్ షో హోస్ట్ గా కిచ్చా సుదీప్ తనకంటూ ప్రత్యేక గుర్తింపును తెచ్చుకున్నారు.

ఈగ సినిమాలో విలన్ పాత్రతో తెలుగు ప్రేక్షకులకు సుపరిచితమైన సుదీప్ బాహుబలి, సైరా నరసింహారెడ్డి సినిమాల్లో సైతం నటించారు.

టాలీవుడ్, శాండిల్ వుడ్ తో పాటు పలు బాలీవుడ్, కోలీవుడ్ సినిమాల్లో సైతం నటించిన సుదీప్ ప్రస్తుతం వరుస సినిమా అవకాశాలతో బిజీగా ఉన్నారు.గత ఆదివారం రోజున బిగ్ బాస్ షోలో పాల్గొని ప్రేక్షకులకు ఎంటర్టైన్మెంట్ అందించిన సుదీప్ తాజాగా ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్నారు.

ఈ ఇంటర్వ్యూలో సుదీప్ కు టాలీవుడ్ ఇండస్ట్రీలో చిరంజీవి, ప్రభాస్, మహేష్ బాబు, ఎన్టీఆర్ లలో ఎవరు ఇష్టమనే ప్రశ్న ఎదురైంది.సాధారణంగా స్టార్ హీరోలు ఇలాంటి ప్రశ్నలకు సమాధానం చెప్పడానికి పెద్దగా ఇష్టపడరు.

కానీ సుదీప్ మాత్రం తడుముకోకుండా తనకు తెలుగులో జూనియర్ ఎన్టీఆర్ అంటే ఎంతో ఇష్టమని చెప్పారు.

Sandle Wood Actor Sudeep Interesting Comments About Junior Ntr, Ntr, Sudheep, Ko
Advertisement
Sandle Wood Actor Sudeep Interesting Comments About Junior Ntr, Ntr, Sudheep, Ko

జూనియర్ ఎన్టీఆర్ తో తనకు చాలా కాలంగా పరిచయం ఉందని ఎన్టీఆర్ ఎల్లప్పుడూ ఎంతో ఎనర్జిటిక్ గా కనిపిస్తారని సుదీప్ అన్నారు.ఇతరులకు గౌరవం ఇచ్చే విషయంలో ఎన్టీఆర్ కు ఎవరూ సాటిరారని.ఎన్టీఆర్ తనకు క్లోజ్ ఫ్రెండ్ అని అన్నారు.

ప్రతి క్షణం నేర్చుకుంటూ.ఎంత చేసినా ఇంకా ఏదో చేయాలని ఎన్టీఆర్ ఆలోచిస్తూ ఉంటాడని సుదీప్ అన్నారు.

ఇటీవల విడుదల కొమరం భీమ్ ట్రైలర్ ను కూడా చూశానని ఎన్టీఆర్ భీమ్ పాత్రలో బాగా చేశాడని తెలిపారు.

Sandle Wood Actor Sudeep Interesting Comments About Junior Ntr, Ntr, Sudheep, Ko

చిరంజీవి గారితో తాను సైరా నరసింహారెడ్డి సినిమాలో కలిసి నటించానని.చిరంజీవి గారు తనకు బాగా తెలుసని సుదీప్ తెలిపారు.ప్రభాస్, మహేష్ బాబు ఇమేజ్ మరో లెవెల్ లో ఉందంటూ సుదీప్ కామెంట్లు చేశారు.

పైసా ఖర్చు లేకుండా ఈ మ్యాజికల్ హోమ్ మేడ్ సీరం తో తెల్లగా మెరిసిపోండి!

ఎన్టీఆర్ పై ప్రశంసల వర్షం కురిపించిన సుదీప్ ఇప్పటివరకు ఎన్టీఆర్ తో కలిసి నటించకపోవడం గమనార్హం.ఆర్ఆర్ఆర్ సినిమాలో సుదీప్ నటిస్తున్నట్టు వార్తలు వస్తున్నా చిత్రయూనిట్ నుంచి అధికారిక ప్రకటన వెలువడాల్సి ఉంది.

Advertisement

తాజా వార్తలు