తెలుగు ప్రేక్షకులకు హీరోయిన్ సంయుక్త మీనన్( Samyuktha Menon ) గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.
సంయుక్త మీనన్ పేరు వినగానే గుర్తుకువచ్చే సినిమాలు భీమ్లా నాయక్, బింబిసార.
గత ఏడాది విడుదల అయిన బింబిసార, భీమ్లా నాయక్ సినిమాలలో నటించి భారీ క్రేజ్ ని సంపాదించుకుంది ఈ బ్యూటీ.ఈ రెండు సినిమాలు సూపర్ హిట్ గా నిలచిన విషయం తెలిసిందే.
కాగా ఈ ముద్దుగుమ్మ ప్రస్తుతం టాలీవుడ్ లో వరుసగా అవకాశాలు అందుకుంటూ దూసుకుపోతోంది.తెలుగుతో పాటు మలయాళం, కన్నడ, తమిళ్ సినిమాలలో కూడా నటించి మంచి గుర్తింపు తెచ్చుకున్న విషయం తెలిసిందే.
కాగా తెలుగులో ఇటీవలే విడుదలైన విరూపాక్ష సినిమాతో( Virupaksha ) ప్రేక్షకులను పలకరించింది సంయుక్త మీనన్.ఈ సినిమాతో మరో బ్లాక్ బస్టర్ మూవీని తన ఖాతాలో వేసుకుంది ఈ ముద్దుగుమ్మ.
ఆమె నటించిన మూడు సినిమాలు కూడా సూపర్ హిట్గా నిలవడంతో ఈ ముద్దుగుమ్మ అంతకంతకూ పెరుగుతోంది.వరుసగా విజయాలు రావడంతో ఆమెది గోల్డెన్ హ్యాండ్ గా మారిపోయింది.
దాంతో దర్శక నిర్మాతలు ఆమె అయితే ఎక్కువగా మొగ్గుచూపుతున్నారు.సంయుక్త హీరోయిన్ గా నటిస్తే ఆ సినిమా హిట్ అవుతుంది అన్న నమ్మకం ప్రేక్షకులలో కూడా నెలకొంది.
కేవలం అందం అభినయం నటన మాత్రమే కాకుండా మనసు కూడా గొప్ప మనసు అని తాజాగా నిరూపించుకుంది సంయుక్త మీనన్.
ఆమె చేసిన ఒక గొప్ప పనితో ప్రేక్షకులలో మరింత ఫేమస్ అయిపోయింది.తాజాగా విరూపాక్ష మూవీ యూనిట్‌తో కలసి ఓంకార్ నిర్వహిస్తున్న సిక్త్ సెన్స్ షోలో( Sixth Sense Show ) పాల్గొన్నారు సంయుక్త.ఈ షోలో అన్ని టాస్క్‌లు గెలిస్తే స్కూటీ ఇస్తానని ఓంకార్ మాట ఇచ్చారు.
అయితే విరూపాక్ష చిత్ర యూనిట్ ఆ స్కూటీని గెలిస్తే అక్కడున్న విద్యార్థుల్లో ఎవరికో ఒకరికి ఇచ్చేస్తామని చెప్పారు.అన్ని టాస్కుల్లోనూ గెలవడంతో ఓం కార్ ఒక స్కూటీని ఇచ్చారు.
ఈ స్కూటీని ఎవరికీ ఇస్తారు అని ఓంకార్ ప్రశ్నించగా నేను సెలెక్ట్ చేస్తాను అంటూ సంయుక్త స్టూడెంట్స్‌లో ఇద్దర్ని సెలెక్ట్ చేశారు.సింగల్ పేరెంట్ ఎవరికీ వున్నారు అని అడగగా ఇద్దరికి లేరు అని తెలియడంతో ఇద్దర్ని స్టేజి పైకి పిలిచి వారిలో ఒకరికి ఆమె స్కూటీ ఇచ్చేశారు.మరో అమ్మాయికి నువ్వేం భయపడకు నేనే నీకు స్కూటీ కొనిస్తాను అంటూ హామీ ఇచ్చింది.
దాంతో ఆ విద్యార్థులు సంయుక్తను కౌగిలించుకుని కృతజ్ఞతలు తెలిపారు.దాంతో సంయుక్త చేసిన పనికి నెటిజన్స్ పొగడ్తల వర్షం కురిపిస్తున్నారు.
బ్యూటి విత్ హార్ట్ అంటూ ఆమెపై ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు.
తాజా వార్తలు
Download App
Channels
HomeEnglish NewsTeluguStop Exclusive StoriesFlash/Breaking NewsTrending NewsPoliticalMovieHealth TipsCrime NewsMovie ReviewsNRI NewsViral VideosBhakthi/DevotionalPress ReleasesViral StoriesQuotesPhoto TalksBaby Boy NamesBaby Girl NamesCelebrity ProfilesFollow Us!
Contact Us!
TeluguStop.com Media, Siya Residency, Sri Sri Circle, Khammam, Telangana- 507002info@telugustop.comPh No : 999-279-9973
About Us!
About UsJobsAdvertisingDMCA / RemovalTerms of UsePrivacy Policy