Samuthirakani : సునీల్, త్రివిక్రమ్ గురించి షాకింగ్ విషయాలు రివీల్ చేసిన సముద్రఖని.. అలా చెప్పడంతో?

సముద్రఖని( Samuthirakani ) దర్శకత్వంలో పవన్ కళ్యాణ్, సాయి ధరమ్ తేజ్ కలిసి నటించిన తాజా చిత్రం బ్రో.

ఈ సినిమాలో కేతికా శర్మ, ప్రియా ప్రకాష్ వారియర్ నటించిన విషయం తెలిసిందే.

ఇప్పటికే ఈ సినిమాపై భారీగా అంచనాలు నెలకొన్నాయి.ఈ సినిమా నుంచి విడుదలైన పాటలు పోస్టర్ లు సినిమాపై అంచనాలను మరింత పెంచేశాయి.

ఈ సినిమా ఈనెల 28న విడుదల కానుంది.సినిమా విడుదల చేతికి మరో మూడు రోజులు మాత్రమే సమయం ఉండడంతో మూవీ మేకర్స్ ప్రమోషన్స్ నీ వేగవంతం చేశారు.

ప్రస్తుతం చిత్ర బృందం ప్రమోషన్స్ లో భాగంగా బిజీ బిజీగా ఉన్నారు.

Samuthirakani Reveals About Actor Sunil And Trivikram
Advertisement
Samuthirakani Reveals About Actor Sunil And Trivikram-Samuthirakani : సు�

ఈ సందర్భంగా తాజాగా ఒక మీడియాతో ముచ్చటించిన డైరెక్టర్ సముద్రఖని పలు ఆసక్తికర విషయాలను వెల్లడించారు.అలాగే సునీల్, డైరెక్టర్ త్రివిక్రమ్ శ్రీనివాస్ పై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.సముద్రఖని దర్శకుడిగా మారిన తరువాత తెరకెక్కించిన 15వ సినిమా బ్రో.1994లో అసిస్టెంట్ డైరెక్టర్‌గా తన ప్రయాణం మొదలవగా అప్పటి నుంచి జయాపజయాలతో సంబంధం లేకుండా ముందుకు సాగుతూ వస్తున్నారు.మన పని మనం సరిగ్గా చేస్తుంటే చాన్స్‌లు వాటంతట అవే వస్తాయి.

అలా వచ్చిన వాటని సద్వినియోగం చేసుకోవాలి అని తెలిపారు సముద్రఖని.నేను టీం వర్క్ బాగా నమ్ముతాను, అందులోని ఇక్కడి నేటివిటీపై త్రివిక్రమ్ గారికి ఉన్నంత పట్టు తనకు ఉండదు.

Samuthirakani Reveals About Actor Sunil And Trivikram

అంతేకాదు పవన్‌( Pawan kalyan ) మూవీని డైరెక్ట్ చేసేంత పెద్ద బాధ్యత అప్పగించడం నాకు నిజంగా ఆశ్చర్యం కలిగించింది.అల వైకుంఠపురములో చిత్రం నుంచే త్రివిక్రమ్‌ తో ట్రావెల్ అవుతున్నప్పటికీ నటుడు సునీల్ వల్ల ఆయనకు తన గురించి ముందే తెలుసుకున్నాను.ఎందుకంటే శంభో శివ శంభో సినిమా( Shambo Shiva Shambo ) సమయంలోనే త్రివిక్రమ్‌కు సునీల్ చెప్పేవారు.ఆ విధంగా దర్శకుడిగా తనపై త్రివిక్రమ్‌కు ముందు నుంచే నమ్మకం ఉంది అని చెప్పుకొచ్చారు సముద్రఖని.2004లో గురువు బాలచందర్ గారితో కలిసి చూసిన డ్రామాను స్ఫూర్తిగా తీసుకొని తమిళ్‌లో వినోదయం సిత్తం సినిమా చేశాను.కానీ ఆ నాటక రచయితకు డబ్బు ఇచ్చినా తీసుకోలేదు.

సమాజానికి మంచి సందేశం ఇవ్వాలని ప్లాన్ చేస్తే, సమాజం మనకి మంచే చేస్తుంది.ఈ సినిమా విషయంలోనూ అదే జరిగిందని చెప్పుకొచ్చారు డైరెక్టర్.

తెలుగు రాశి ఫలాలు, పంచాంగం - మే 26, శుక్రవారం 2023
Advertisement

తాజా వార్తలు