సంపత్‌ నంది షాకింగ్‌ డ్రీమ్స్‌

మెగా పవర్‌స్టార్‌ రామ్‌చరణ్‌తో ‘రచ్చ’ చిత్రాన్ని తెరకెక్కించి ఒక్కసారిగా క్రేజీ డైరెక్టర్‌గా మారిన సంపత్‌ నంది దర్శకత్వంలో పవన్‌ కళ్యాణ్‌ ‘గబ్బర్‌సింగ్‌’ చిత్రాన్ని చేయాలని భావించిన విషయం తెల్సిందే.

కొన్ని కారణాల వల్ల ఆ సినిమా లేట్‌ అయ్యింది.

దాంతో సంపత్‌ నంది ఆ సినిమా నుండి తప్పుకున్నాడు.పవన్‌ సినిమా నుండి తప్పుకున్న వెంటనే రవితేజతో ‘బెంగాల్‌ టైగర్‌’ చిత్రాన్ని ప్రారంభించాడు.

ఇక ఈ సినిమా విడుదలకు సిద్దంగా ఉంది.ఈ వారంలో ప్రేక్షకుల ముందుకు రాబోతున్న ‘బెంగాల్‌ టైగర్‌’ చిత్రం తర్వాత ఈ దర్శకుడు యంగ్‌ టైగర్‌తో సినిమా చేయాలని క కంటున్నాడు.

రవితేజ ‘బెంగాల్‌ టైగర్‌’ సినిమాపై భారీ అంచనాలు ఉన్నాయి.ఆ అంచనాలకు తగ్గట్లుగానే ఈ సినిమా ఉంటుందని, తప్పకుండా ప్రేక్షకులను ఆకట్టుకుంటుందనే నమ్మకంతో దర్శకుడు సంపత్‌ నంది ఉన్నాడు.

Advertisement

ఈ సినిమా సక్సెస్‌ అయితే తాను ఇప్పటికే రెడీ చేసుకుని ఉన్న కథతో ఎన్టీఆర్‌ వద్దకు వెళ్లబోతున్నట్లుగా చెప్పుకొచ్చాడు.యంగ్‌ టైగర్‌ను ఆయన ఫ్యాన్స్‌ ఎలా చూడాలని కోరుకుంటున్నారో అలాంటి సినిమాను తాను ఎన్టీఆర్‌తో తీస్తాను అని, ఆయనలోని అన్ని మాస్‌ యాంగిల్స్‌ను తాను బయటకు తీసుకు వచ్చేలా స్క్రిప్ట్‌ రెడీ చేస్తున్నట్లుగా సంపత్‌ నంది అంటున్నాడు.

మరి ‘బెంగాల్‌ టైగర్‌’ సక్సెస్‌ అయ్యి ఎన్టీఆర్‌ ఈయనకు అవకాశాన్ని ఇస్తాడేమో చూడాలి.

Advertisement

తాజా వార్తలు