ఓకే టైటిల్ తో అక్కినేని, ఎన్టీఆర్, చిరంజీవి సినిమాలు.. ఏది హిట్ ? ఏది ఫట్ ?

సినిమా పరిశ్రమలో సేమ్ సినిమా టైటిళ్లు వాడటం చాలా కాలంగా వస్తూనే ఉంది.గతంలో వచ్చిన సినిమాలు మంచి విజయాన్ని అందుకోవడంతో.

అదే సినిమా పేరు తమ సినిమాకు కూడా పెడితే సెంటిమెంట్ వర్కౌట్ అవుతుందని చాలా మంది ఫిల్మ్ మేకర్స్ భావిస్తారు.అందుకే పాతన పేర్లనే మళ్లీ రిపీట్ చేసేందుకు మొగ్గు చూపుతారు.

గతంలో మూడు దశాబ్దాల్లో ముగ్గురు టాప్ హీరోలు ఒకే టైటిల్ తో సినిమాలు చేశారు.ఇంతకీ ఆ సినిమాల్లో ఏది హిట్టు? ఏది ఫట్టు? అనే విషయాన్ని ఇప్పుడు తెలుసుకుందాం.జగపతి నిర్మాణ సంస్థ అధినేత రాజేంద్ర ప్రసాద్ హీరో అవుదామని మద్రాసుకు వచ్చాడు.

కానీ అక్కడ ప్రొడ్యూసర్ గా మారిపోయాడు.అలా తన నిర్మాణ సంస్థ ద్వారా 1960లో అన్నపూర్ణ అనే సినిమాను నిర్మించాడు.

Advertisement
Same Movie Title With Akkineni Ntr And Chiranjeevi, Aradhana Movie, Chiranjeevi,

రెండో సినిమాగా 1962లో మధుసూదనరావు దర్శకత్వంలో నాగేశ్వర్ రావు, సావిత్రి జంటగా ఆరాధన సినిమా నిర్మించాడు.ఈ సినిమా యావరేజ్ గా నిలిచింది.

ఇదే టైటిల్ తో భాస్కరచిత్ర బ్యానర్ మీద 1976లో బివి ప్రసాద్ దర్శకత్వంలో ఎన్టీఆర్, వాణిశ్రీ జంటగా ఆరాధన సినిమా వచ్చింది.

Same Movie Title With Akkineni Ntr And Chiranjeevi, Aradhana Movie, Chiranjeevi,

నా మది నిన్ను పిలిచింది గానమై అనే పాట అప్పట్లో సంచలన విజయం సాధించింది.ఈ సినిమాకు హనుమంతరావు సంగీత సారథ్యం వహించాడు.పాటలు జనాలను విపరీతంగా ఆకట్టుకోవడంతో ఈ సినిమా మంచి విజయాన్ని అందుకుంది.

అటు 1987లో ఇదే టైటిల్ తో మరో సినిమా రూపొందింది.గీతా ఆర్ట్స్ బ్యానర్ మీది చిరంజీవి హీరోగా ఆరాధన సినిమా వచ్చింది.

Same Movie Title With Akkineni Ntr And Chiranjeevi, Aradhana Movie, Chiranjeevi,
ఖాళీ కడుపుతో జ్యూస్ తాగుతున్నారా?... ఈ విషయాలు తెలుసుకోండి!

ఈ సినిమా ఫ్లాప్ అయ్యింది.చిరంజీవికి ఈ ఏడాది ప్రత్యేకత ఏంటంటే.క్లాసిక్ సినిమాల దర్శకుడు భారతీరాజా తెలుగు చివరి చిత్రం ఆరాధనలో నటించాడు.

Advertisement

ఈ సినిమాలో రాధిక, సుహాసిని హీరోయిన్లుగా నటించారు.ఇళయరాజా రూపొందించిన అరె ఏమైందీ.

ఒక మనసుకు రెక్కలొచ్చి ఎక్కడికొ ఎగిరింది అనే పాట మంచి విజయాన్ని అందకుంది.కానీ సినిమా మాత్రం ఫ్లాప్ గా నిలిచింది.

తాజా వార్తలు