Samantha Yashoda : యశోద బ్రేక్‌ ఈవెన్ సాధించినట్లేనా? మొత్తం వచ్చింది ఎంత?

టాలీవుడ్ స్టార్ హీరోయిన్ సమంత మరో సక్సెస్ దక్కించుకుంది.యశోద సినిమా తో పాన్ ఇండియా స్థాయిలో ప్రేక్షకుల ముందుకు వచ్చిన సమంత బ్రేక్ ఈవెన్ సాధించినట్లుగా చిత్ర యూనిట్ సభ్యులు చెప్తున్నారు.

20 కోట్ల రూపాయల ఫ్రీ రిలీజ్ బిజినెస్ చేసిన యశోద ఒకటి రెండు ఏరియాలో మినహా అన్ని ఏరియాల్లో కూడా బ్రేక్ ఈవెన్ సాధించింది.సమంత కెరియర్ లో మరో బ్రేక్ ఈవెన్‌ పడింది అంటూ ఆమె అభిమానులు మరియు ఇండస్ట్రీ వర్గాల వారు అంటున్నారు.

ఇక మళ్లీ ఆమె కెరీర్‌ జెట్ స్పీడ్ గా దూసుకు పోవడం పక్కా అంటూ ఆమె అభిమానులు మాట్లాడుకుంటున్నారు.సరోగసి విధానం నేపథ్యం లో ఈ సినిమా రూపొందిన విషయం తెలిసిందే.

వరలక్ష్మి శరత్ కుమార్ ఈ సినిమా లో కీలక పాత్ర లో నటించింది.సమంత యశోద సినిమా కు పోటీగా బాక్సాఫీస్ వద్ద మరే సినిమా లేకపోవడం వల్ల కూడా ఈ సినిమా కు కలిసి వచ్చింది అనేది టాక్.

Advertisement

మరో వైపు సమంత అనారోగ్యం సమస్యలు ఎదుర్కొంటూ కూడా డబ్బింగ్ చెప్పింది.అంతే కాకుండా సినిమా కు ప్రమోషన్ చేసింది.

కనుక ఆమె పై సింపతి తో కూడా యశోద సినిమా ను చాలా మంది చూసి ఉంటారు అంటూ కొందరు మాట్లాడుకుంటున్నారు.మొత్తానికి ఏదో రకంగా అయితే యశోద సినిమా సక్సెస్ అయ్యి బ్రేక్ ఈవెన్‌ కలెక్షన్స్ నమోదు చేసింది.

కనుక సమంత రాబోయే సినిమా శాకుంతలం కచ్చితం గా మంచి బిజినెస్ చేసే అవకాశం ఉందని సమాచారం అందుతుంది.శాకుంతలం సినిమా విషయంలో ఇప్పటికే చాలా హైప్‌ క్రియేట్ చేశారు.

గుణశేఖర్ స్వీయ దర్శకత్వం లో రూపొందిన శాకుంతలం సినిమా ను దిల్‌ రాజు సమర్పించబోతున్నాడు.శాకుంతలం సినిమా లో విజువల్ ఎఫెక్ట్స్ అత్యంత కీలక పాత్ర పోషిస్తాయట.

వ‌ర్షాకాలంలో నైట్ ఈ విధంగా పాల‌ను తీసుకుంటే మ‌స్తు హెల్త్ బెనిఫిట్స్‌!

అందుకే సినిమాలోని ఆ సన్నివేశాలకు కాస్త ఎక్కువ ఖర్చు చేసి వీఎఫ్‌ఎక్స్‌ చేస్తున్నారని సమాచారం అందుతుంది.వచ్చే ఏడాది ఆరంభం లో సినిమా విడుదల అయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి.

Advertisement