అనుష్క కాదు సమంత

దిల్ రాజు నిర్మాణంలో కృష్ణవంశీ ఒక సినిమా చేయనున్నారనే విషయం తెలిసిందే.భారి ఎత్తున గ్రాఫిక్స్ ప్రధానంగా ఈ చిత్రాన్ని తెరకెక్కించనున్నారని సమాచారం.

ఇందులో హీరో ఉండడు.హీరోయిన్ ప్రధాన పాత్రలో సాగే చిత్రం కావడంతో మొదట తమన్నా పేరుని అనుకున్నారు.

కాని అనుష్క అయితేనే బాగుంటుందని, పైగా అనుష్కకి ఇప్పటికే సొంతంగా మార్కెట్ ఉండటంతో తనే ఈ సినిమాకి కరెక్ట్ అనుకున్నారు.కాని అనుష్క ఇప్పటికే ఇలాంటి సినిమాలు చేయడం, పైగా తన సొంత భుజాల మీద మోసిన రుద్రమదేవి,సైజ్ జీరో రెండూ కూడా ఆశించిన ఫలితాలు రాబట్టడంలో విఫలమవడంతో మళ్ళి ఇప్పట్లో హీరోయిన్ ప్రధాన సినిమాలు చేయలేనని చెప్పేసిందట అనుష్క.

అనుష్క కాదనడంతో వేరే దారులు వెతుకుతున్నారు దర్శకనిర్మాతలు.అందులో భాగంగానే సమంతని సంప్రదించారట.

Advertisement

సమంత ఇంకా ఎటు తెల్చలేదట.ఇప్పటివరకు దాదాపుగా అన్ని గ్లామర్ రోల్సే చేసిన సమంత, ఇలా కొత్తదారిన నడుస్తుందో లేదో చూడాలి.

Writers : సినిమా ఇండస్ట్రీ లో క్రియేటివ్ రైటర్స్ ఎక్కడ ఉన్నారు.? అంతా
Advertisement

తాజా వార్తలు