సమంతకి అక్కడ సమస్య ... అందుకే ఆ కండీషన్ పెట్టిందట

మనిషి శరీరం అన్నాక ఎన్నోరకాల సమస్యలు ఉంటాయి.సినిమా సెలబ్రిటిలైతే ఏంటి .

ఎంత మెయింటేన్ చేసినా ఏంటి .వారిది కూడా మానవ శరీరమే.వారికి సమస్యలు ఉంటాయి.

హీరోయిన్ సమంతకి కూడా ఓ సమస్య ఉంది.అదే స్కిన్ ఇర్రిటేషన్, స్కిన్ ఎలర్జీ.

ఈ సమస్య సమంతకు కొన్నేళ్ళ నుంచి ఉంది.అప్పట్లో సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు సినిమా చేస్తున్నప్పుడు ఈ విషయం బయటపడింది.

Advertisement

ఆ టైంలో సమస్య ఎక్కువవడంతో సమంత ఓ నాలుగు నెలలు సినిమాల నుంచి బ్రేక్ తీసుకుంది.ఎక్కడ కనిపించలేదు.

ఈ సినిమా ఫంక్షన్ కి కూడా రాలేదు.దాంతో సీతమ్మ వాకిట్లో సిరిమల్లె షూటింగ్ లో ఇబ్బందులు తలెత్తాయి.

సినిమా కొన్నిరోజులు ఆగిపోయింది.అందుకే సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు, దసరాకు రావాల్సింది సంక్రాంతికి వచ్చింది.

ఇప్పుడు మళ్ళీ ఆ సమస్య సమంతను వేధిస్తున్నట్టు ఉంది.అందుకే ముందుజాగ్రత్తలు తీసుకుంటోంది.

హాలీవుడ్ రేంజ్ సినిమా అంటే అది రవిబాబు అనసూయ మాత్రమే !

మొన్న సమ్మర్ లో రంగస్థలం 1985 కి షూట్ చేసినప్పుడు సమంత ఆరోగ్యం దెబ్బతింది.అలాగే చర్మసమస్యలు మళ్ళీ బయటకొచ్చాయి.

Advertisement

అందుకే ఇకనుంచి ఎండల్లో ఎక్కువరోజులు షూట్ చేయకూడదు అని డిసైడ్ చేసుకుందట సమంత.ఒక తమిళ సినిమా చేస్తుంది సమంత.

అందులో శివకార్తికేయాన్ హీరో.ఈ సినిమా ఇలా ఒప్పుకుందో లేదో, అలా వెంటనే డైరక్టర్ దగ్గరికి వెళ్లి తన కండీషన్స్ చెప్పేసిందట.

ఆ కండీషన్స్ ఏమిటంటే, ఎండలో ఎక్కువరోజులు షూట్ ఉండకూడదు.ఎండలో ఉండే షాట్స్ ని త్వరగా పూర్తి చేయాలి.

అలాగే ఎక్కువ వేడి తనకి తగలకుండా ఏర్పాట్లు చేయాలి.అలాగే ఒక పర్సనల్ డాక్టర్ ని నియమించాలి.

ఈ కండీషన్స్ అన్నిటికి ఒప్పుకుంటూనే సమంత సినిమా చేస్తాను, లేదంటే ఇంకో హీరోయిన్ ని చూసుకోండి అంటూ సూటిగా చెప్పేసిందట సామ్.ఇక స్టార్ హీరోయిన్ అన్నాక అడ్జస్ట్ అవకతప్పదు అని కండీషన్స్ కి సరే అన్నారట దర్శకనిర్మాతలు.