మరో అనారోగ్య సమస్యకు గురైన సమంత... ఎమోషనల్ పోస్ట్ వైరల్!

టాలీవుడ్ ఇండస్ట్రీలో క్రేజీ హీరోయిన్ గా ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్న వారిలో నటి సమంత( Samantha ) ఒకరు.

అయితే ఇటీవల కాలంలో సమంత తన స్పీడ్ కాస్త తగ్గించింది.

అందుకు గల కారణం తన వ్యక్తిగత విషయాలనీ చెప్పాలి.సమంత నాగచైతన్య( Naga Chaitanya ) నుంచి విడాకులు తీసుకొని విడిపోయిన తర్వాత ఎన్నో రకాల ఇబ్బందులను ఎదుర్కొంటుంది.

పూర్తిగా డిప్రెషన్ లోకి వెళ్లిపోయిన ఈమె ఆ డిప్రెషన్ నుంచి బయటపడుతూ సినిమాలకు కమిట్ అయ్యారు .అయితే ఈ సినిమాలో షూటింగ్ సమయంలోనే మయోసైటీసిస్( Myositis ) వ్యాధికి గురి అయ్యారు.ఇక ఈ వ్యాధి నుంచి బయటపడటం కోసం సమంత కొంతకాలం పాటు సినిమా ఇండస్ట్రీకి దూరంగా ఉన్నారు.

ఇక ఈ వ్యాధి నుంచి పూర్తిగా కోరుకున్న ఈమె తిరిగి తన కెరీర్ పై ఫోకస్ పెట్టారు.ఈ క్రమంలోనే సినిమాలతో పాటు వెబ్ సిరీస్ లకు కూడా కమిట్ అయ్యారు తప్ప వాటి గురించి ఎలాంటి అప్డేట్స్ మాత్రం ఇవ్వలేదు.ఈమె చివరిగా ఖుషి సినిమా( Khusi Movie ) ద్వారా వెండి తెరపై ప్రేక్షకులను సందడి చేశారు.

Advertisement

ఇలా వెండి తెరకు  గత కొద్దిరోజులుగా దూరంగా ఉంటున్న సమంత సోషల్ మీడియాలో మాత్రం ఎంతో యాక్టివ్ గా ఉంటూ తనకు సంబంధించిన అన్ని విషయాలను ఎప్పటికప్పుడు అభిమానులతో పంచుకుంటూ ఉన్నారు.

తాజాగా సమంత సోషల్ మీడియా వేదికగా షేర్ చేసిన పోస్ట్ చూస్తే మాత్రం ఈమె మరో వ్యాధికి గురయ్యారని తెలుస్తోంది.ఇన్ స్టా వేదికగా ఓ స్టోరీ పెట్టిన ఆమె జిమ్‌లో వర్కవుట్ చేస్తున్న పిక్‌ను షేర్ చేసింది.చికెన్ గున్యా( Chicken Gunya ) వల్ల వచ్చిన కీళ్లనొప్పుల నుంచి కోలుకోవడం అనేది చాలా ఫన్‌గా ఉంటుందంటూ ఒక సాడ్ ఎమోజిని షేర్ చేశారు.

దీంతో ఈ పోస్ట్ కాస్త సోషల్ మీడియాలో వైరల్ గా మారడంతో సమంత చికెన్ గునియా వ్యాధితో బాధపడుతున్నారా అంటూ అభిమానులు కంగారు వ్యక్తం చేయడమే కాకుండా తనకు మంచి ఆరోగ్యాన్ని ప్రసాదించాలని కామెంట్లు చేస్తున్నారు.

వైరల్ వీడియో : ఏంటి బ్రో హీరోను పుసుక్కున అంత మాటనేశావ్..
Advertisement

తాజా వార్తలు