ప్రతి ఒక్కరి కథ మాస్టర్ పీస్ అవుతుంది.. హీరోయిన్ సమంత కామెంట్స్ వెనుక అర్థం ఇదేనా?

టాలీవుడ్ స్టార్ హీరోయిన్ సమంత( Samantha ) గురించి మన అందరికి తెలిసిందే.సమంత ప్రస్తుతం అనారోగ్య సమస్య నుంచి నెమ్మదిగా కోలుకుంటున్న విషయం తెలిసిందే.

గత కొంతకాలంగా మయోసైటిస్ అనే వ్యాధితో బాధపడుతున్న సమంత ఇప్పుడిప్పుడే ఆ సమస్య నుంచి నెమ్మదిగా కోలుకుంటోంది.మళ్లీ సినిమాలలో బిజీబిజీ అవ్వడానికి ప్రయత్నిస్తోంది.

ప్రస్తుతం సినిమాలకు దూరంగా ఉన్న సమంత సోషల్ మీడియాలో( social media ) మాత్రం ఫుల్ యాక్టివ్ గా ఉంటోంది.తరచూ ఏదోక పోస్టుతో సోషల్ మీడియాలో నిలుస్తూనే ఉంది.

తాజాగా మరోసారి వార్తల్లో నిలిచింది సమంత.అంతర్జాతీయ మహిళా దినోత్సవం ( International Womens Day )సందర్భంగా మహిళలకు శుభాకాంక్షలు తెలుపుతూ ఈ మేరకు తన ఇంస్టాగ్రామ్ స్టోరీలో ఒక పోస్ట్ కూడా చేశారు.

Advertisement

ఆ పోస్ట్ లో ఈ విధంగా రాసుకొచ్చారు.తుఫానులను దయతో నావిగేట్‌ చేసేది.

ప్రపంచాన్ని తన నిశ్శబ్ద కౌగిలిలో పట్టుకున్నది.అడుగడుగునా కలలను బ్యాలెన్స్‌ చేసేది, ఊపిరి పీల్చుకున్నప్పుడు కూడా పైకి లేచేది.

తిరిగి అడగకుండా ఇచ్చేది, ఆవేశంతో రగిలిపోయేది, అయినా ఆరాటపడుతూనే ఉంటుంది, భారాలు, కాంతి రెండింటినీ మోసే ఆమె చీకటి రాత్రిలో కూడా ప్రకాశిస్తుంది.అవన్నీ తప్పిపోకుండా చేస్తుంది, తను ఎదుర్కొన్న ప్రతి సవాల్‌ తిప్పికొడుతుంది.

ఆమె తన శక్తితో ఎప్పుడూ మండుతూనే ఉంటుంది అని సమంత రాసుకొచ్చింది.అలాగే మహిళా దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు.దీనితో పాటు మరో వీడియోను కూడా షేర్‌ చేశారు.

ఈ రాశుల వారు పక్కవారి ఐడియాలను కాపీ చేస్తారు..!

ఎర్లీ మార్నింగ్‌ లైఫ్‌, ఒక వాగ్దానం, ఒక ఆశ, చిన్న కల, ఏదో ధైర్యం, చేయగలననే నమ్మకం తను ఏదో రాయాలనుకుంటుంది అంటూ వీడియోలో తెలిపింది.ఈ సందర్భంగా సమంత చేసిన పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్ అవ్వడంతో అభిమానులు పాజిటివ్ గా స్పందిస్తూనే ఉమెన్స్ డే శుభాకాంక్షలు తెలుపుతున్నారు.

Advertisement