రెండో పెళ్లికి సిద్ధమైన సమంత.. వచ్చే ఏడాదే పెళ్లి పిల్లలంటూ పోస్ట్!

సినీనటి సమంత(Samantha ) రెండో పెళ్లికి సిద్ధమయ్యారా అంటే అవునని తెలుస్తుంది.

తాజాగా ఈమె చేసిన పోస్ట్ చూస్తే కనుక ఈమె త్వరలోనే రెండో పెళ్లి చేసుకోబోతున్నారంటూ స్పష్టమవుతుంది మరి సమంత సోషల్ మీడియా వేదికగా చేసిన ఆ పోస్ట్ ఏంటి అనే విషయానికి వస్తే.

త్వరలోనే కొత్త సంవత్సరం రాబోతున్న నేపథ్యంలో ప్రతి ఒక్కరు కూడా కొత్త సంవత్సరంలో సంతోషంగా గడపాలని ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఉండాలని కోరుకుంటారు.అయితే ఈ క్యాటగిరి లోనే సమంత కూడా ఉన్నారని చెప్పాలి.

ఇలాంటి వాటిని సమంత కూడా ఎక్కువగా నమ్ముతారని తాజాగా ఈ పోస్టు చూస్తేనే తెలుస్తుంది.తన జాతకం ప్రకారం వచ్చేయడాది తన రాశి(Zodiac) చాలా అద్భుతంగా ఉందని సమంత చెప్పగానే చెప్పేశారు.2025వ సంవత్సరంలో తన రాశి వారు ఏ వృత్తిలోనైనా విజయం సాధిస్తారని అలాగే ఆర్థికంగా ఎంతో అభివృద్ధి సాధిస్తారని తెలియజేశారు.అలాగే మానసికంగా, శారీరకంగా కూడా చాలా స్ట్రాంగ్ అవుతారని ఈమె పోస్ట్ చేశారు.

వృత్తిపరంగా మరింత బిజీ కాబోతున్నట్లు సమంత తన రాశిలో ఉందని తెలిపారు.ఇక ఇష్టమైన వ్యక్తి దొరికితే 2025 లోనే ఈ రాశి వారికి పెళ్లి జరుగుతుందని పిల్లాపాపలతో సంతోషంగా గడుపుతారని కూడా సమంత తెలిపారు.

Advertisement

ఇలా సమంత రాశికి చెందిన వారి జాతకాన్ని ఈమె సోషల్ మీడియా వేదికగా పోస్ట్ చేయడంతో ఈమెకు కూడా వచ్చే ఏడాదిలోనే పెళ్లి చేసుకోవాలని ఆలోచనలు ఏమైనా ఉన్నాయా అంటూ పలువురు కామెంట్లు చేస్తున్నారు.ఇలా పెళ్లి పిల్లలు అంటూ సమంత పోస్ట్ చేయడంతో కచ్చితంగా ఈమె రెండో పెళ్లి (Second Marriage) చేసుకుంటారని అభిమానులు భావిస్తున్నారు.ఇప్పటికే తన మాజీ భర్త నాగ చైతన్య (Nagachaitanya) శోభిత (Sobhita) ను రెండో పెళ్లి చేసుకొని తన జీవితంలో సంతోషంగా గడుపుతున్నారు.

ఇక సమంత కూడా రెండో పెళ్లి చేసుకొని సంతోషంగా ఉండాలని అభిమానులు కోరుకుంటున్నారు.

Advertisement

తాజా వార్తలు