విడాకులు తీసుకుంటే  అలా జడ్జ్ చేస్తారా....ఫైర్ అయిన సమంత?

సినీనటి సమంత( Samantha ) హీరోయిన్ గా ఇండస్ట్రీలో ఎంతో మంచి సక్సెస్ అందుకున్నారు.

నటిగా ఎన్నో అద్భుతమైన సినిమాలలో నటించి ప్రేక్షకులను మెప్పించిన సమంత తన వ్యక్తిగత జీవితంలో మాత్రం ఎన్నో ఇబ్బందులను ఎదుర్కొన్నారు.

ఈమె నాగచైతన్యను( Naga Chaitanya ) ప్రేమించి పెద్దల సమక్షంలో ఎంతో ఘనంగా వివాహం చేసుకున్నారు.ఇలా తన వైవాహిక జీవితంలో ఎంతో సంతోషంగా సాగిపోతున్న నేపథ్యంలో ఇద్దరి మధ్య వచ్చిన భేదాభిప్రాయాలు కారణంగా విడాకులు( Divorce ) తీసుకుని విడిపోయారు.

ఇలా సమంత ప్రస్తుతం సింగిల్గానే ఉంటుంది.నాగచైతన్య మాత్రం మరొక నటి శోభితను పెళ్లి చేసుకున్న సంగతి తెలిసిందే.

ఇలా నాగచైతన్య నుంచి విడాకులు తీసుకొని విడిపోయిన సమంత తాజాగా సమాజంలో విడాకులు తీసుకున్న మహిళ గురించి ఎలా మాట్లాడుతారు వారి పట్ల ఇతరుల ఆలోచన విధానం ఎలా ఉంటుంది అనే విషయం గురించి మాట్లాడుతూ చేసిన కామెంట్స్ ప్రస్తుతం వైరల్ అవుతున్నాయి.ఒక స్త్రీ విడాకులు తీసుకొని విడిపోతే అది ఎంతో అవమానకరంగా భావిస్తారు ఆమె చెడ్డదని ఒక ముద్ర వేస్తారు.రెండో చేతిది, వాడిపోయిన జీవితం అంటూ వారి గురించి హేళనగా మాట్లాడుతారు.

Advertisement

వారిని ఒక మూలకు నెట్టివేసి, ఓడిపోయినట్లు చేస్తారు.అపరాధ భావన కలిగించి, సిగ్గుపడేలా చేస్తారు.అమ్మాయిలకు వారి కుటుంబానికి ఇది చాలా కష్టంగా అనిపిస్తుంది అంటూ సమంత తెలిపారు.

తన జీవితంలోనూ ఇలాంటి ఘటన  జరిగింది.  అయితే నేనుమూలన కూర్చొని ఏడుస్తూ, మళ్ళీ బతకడానికి ధైర్యం లేకుండా ఉండలేదు.

ఇది ప్రతీకారం కాదు.నా జీవితంలో ఇలాంటి ఘటన జరిగింది కానీ నా జీవితమే ఈ ఘటనతో ముగిసి పోలేదని, ఎక్కడైతే ఆగిపోయానో అక్కడే మొదలు పెట్టానని సమంత తెలిపారు.

ప్రస్తుతం నేను చాలా సంతోషంగా, మంచి వ్యక్తులతో పనిచేస్తున్నానని తెలిపారు.నా జీవితంలో కూడా సరికొత్త అధ్యయనం కోసం ఎదురుచూస్తున్నానంటూ సమంత వెల్లడించారు.

ఎంత ప్రయత్నించినా జుట్టు రాలడం ఆగట్లేదా.. అయితే మీరు ఇది ట్రై చేయాల్సిందే!
Advertisement

తాజా వార్తలు