భయపడిన సమంత.. అయ్యో, సమంత ఇంత పని చేసిందేంటి?

అక్కినేని వారి ఇంటి కోడలు అయిన తర్వాత సమంత సినిమాల ఎంపిక విషయంలో తన నిర్ణయాన్ని మార్చుకుంది.

గతంలో గ్లామర్‌ పాత్రలను ఎక్కువగా చేస్తూ వచ్చిన సమంత పెళ్లి తర్వాత కాస్త తగ్గించిందని చెప్పాలి.

హీరోయిన్‌ ఓరియంటెడ్‌ చిత్రాలపై ఈ అమ్మడు ఇంకా మోజు పెంచుకుంది.ఆమద్య సమంత యూటర్న్‌ చిత్రంతో ప్రేక్షకుల ముందుకు వచ్చింది.

ఆ చిత్రం మంచి విజయాన్ని సొంతం చేసుకుని సమంతకు మంచి పేరు తెచ్చింది.

యూటర్న్‌ తెచ్చిన పేరుతో సమంత మరిన్ని లేడీ ఓరియంటెడ్‌ చిత్రాలను చేయాలని ఈమె భావించింది.అందుకోసం మిస్‌గ్రానీ అనే చిత్రాన్ని చేసేందుకు సిద్దం అయ్యింది.కొరియన్‌ మూవీ అయిన మిస్‌ గ్రానీలో హీరోయిన్‌ ముసలమ్మ పాత్రలో కనిపించాల్సి ఉంది.

Advertisement

సమంత వృద్ద మహిళగా కనిపించబోతుంది అంటూ వార్తలు వచ్చాయి.నందిని రెడ్డి దర్శకత్వంలో ఈ చిత్రాన్ని సురేష్‌బాబు నిర్మించేందుకు ఏర్పాట్లు కూడా చేశాడు.

షూటింగ్‌కు అంతా ఓకే అనుకున్న సమయంలో సమంత ఈ చిత్రం నుండి తప్పుకున్నట్లుగా సినీ వర్గాల ద్వారా సమాచారం అందుతోంది.

వృద్దురాలు పాత్రను పోషించేందుకు సమంత నో చెప్పినట్లుగా తెలుస్తోంది.మొదట ఓకే చెప్పినా కూడా కొందరి సలహా కారణంగా మిస్‌ గ్రానీ రీమేక్‌ నుండి తప్పుకున్నట్లుగా తెలుస్తోంది.సమంత తప్పుకోవడంతో కాస్త ఏజ్డ్‌ హీరోయిన్‌ను నందిని రెడ్డి బుక్‌ చేసుకున్నట్లుగా సమాచారం అందుతోంది.

అందుకు సంబంధించిన అధికారిక ప్రకటన త్వరలోనే వెలువడే అవకాశం ఉంది.ప్రస్తుతానికి నందిని రెడ్డి స్క్రిప్ట్‌ వర్క్‌లో ఉంది.

కరోనా వల్ల 'డేంజర్'లో యువత..?
Advertisement

తాజా వార్తలు