శాకుంతలంలో తన పాత్ర గురించి ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేసిన సామ్!

సౌత్ స్టార్ హీరోయిన్ సమంత (Samantha) నుండి రాబోతున్న మరో లేటెస్ట్ సినిమా శాకుంతలం(Shaakuntalam).

గత ఏడాది యశోద సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చి మంచి హిట్ అందుకున్న సమంత ఇప్పుడు మరో లేడీ ఓరియెంటెడ్ సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాబోతుంది.

శాకుంతలం లేడీ ఓరియెంటెడ్ సినిమా అయినప్పటికీ భారీ బడ్జెట్ తో భారీ నిర్మాణ విలువలతో తెరకెక్కింది.టాలీవుడ్ టాలెంటెడ్ డైరెక్టర్ గుణశేఖర్ ( Gunasekhar )దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా పౌరాణిక నేపథ్యంలో తెరకెక్కింది.

ఈ సినిమా ఎప్పుడో షూటింగ్ పూర్తి చేసుకున్న కూడా ఇప్పటి వరకు రిలీజ్ కు నోచుకోలేదు.ఏదొక అడ్డంకి ఎదురవుతూ వాయిదా పడుతూ వస్తుంది.

అందుకే ఈసారి ఈ సినిమాను గ్రాండ్ గా రిలీజ్ చేయడానికి మేకర్స్ సిద్ధం అవుతున్నారు.అసలు ఈ సినిమాను ఫిబ్రవరి 17నే గ్రాండ్ గా రిలీజ్ చేయాలనీ అనుకుని ఈ మేరకు ప్రమోషన్స్ కూడా చేసారు.

Advertisement

కానీ మళ్ళీ వాయిదా వేసి ఈసారి ఏప్రిల్ 14న రిలీజ్ చేయబోతున్నట్టు ప్రకటించారు.ఈసారి ఎలాగైనా రిలీజ్ చేయడానికి అన్ని పనులు పూర్తి చేసి సిద్ధంగా ఉన్నారు.

సమంత కూడా ఈ సినిమా ప్రమోషన్స్ లో యాక్టివ్ గా పాల్గొంటుంది.తాజాగా ఈమె ముంబైలో జరిగిన ప్రమోషన్స్ లో తన పాత్ర గురించి ఈ సినిమా యొక్క అనుభవాల గురించి పంచుకున్నారు.

తన కెరీర్ లో చేసిన బెస్ట్ పాత్రల్లో ఇది ఒకటిగా నిలిచి పోతుందని.అటువంటి గొప్ప పాత్ర చేయడం ఎంతో ఆనందాన్ని ఇచ్చిందని.తప్పకుండ శాకుంతలం రిలీజ్ తర్వాత అందరు గర్వపడతారని.

గుణశేఖర్ ఎంతో గొప్ప టాలెంట్ కలిగిన వ్యక్తి అని ఇంత మంచి టీమ్ తో కలిసి పని చేయడం మర్చిపోలేని అనుభవం అని అన్నారు.

తెలుగు రాశి ఫలాలు, పంచాంగం - అక్టోబర్ 13 , శుక్రవారం , 2023

ఇక ఈ సినిమాలో మేల్ లీడ్ లో దేవ్ మోహన్ నటించాడు.అలాగే ఇందులో అల్లు అర్జున్ డాటర్ అల్లు అర్హ కూడా బాలనటిగా పరిచయం కాబోతుంది.పాన్ ఇండియా లెవల్లో రిలీజ్ కాబోతున్న ఈ సినిమాను గుణ టీమ్ వర్క్స్ బ్యానర్ పై నీలిమ గుణ మరియు దిల్ రాజు సంయుక్తంగా ఈ సినిమాను నిర్మిస్తున్నారు.

Advertisement

తాజా వార్తలు