యశోద కోసం సమంత సొంతది వాడేస్తుంది..!

స్టార్ హీరోయిన్ సమంత వరుస క్రేజీ సినిమాలతో బిజీగా ఉంది.

గుణశేఖర్ డైరక్షన్ లో శాకుంతలం సినిమా పూర్తి చేసిన సమంత ఆ తర్వాత హరి హరీష్ దర్శక ద్వయం డైరక్షన్ లో యశోద సినిమా కూడా ఫినిష్ చేసింది.

థ్రిల్లర్ జానర్ లో తెరకెక్కిన ఈ సినిమా నుంచి వచ్చిన టీజర్ ఒకటి సినిమాపై అంచనాలు పెంచింది.ఇక ఈ సినిమా కోసం సమంత తన సొంత వాయిస్ వాడినట్టు తెలుస్తుంది.

మాములుగా అయితే సమంత తన తెలుగు డబ్బింగ్ కోసం చిన్మయితో చెప్పిస్తుంది.కానీ ఇప్పుడు సమంత తన సొంత డబ్బింగ్ చెప్పుకుంటుంది.

తమిళంలో అయితే సమంత తన వాయిస్ డబ్బింగ్ చెప్పుకుంటుంది కానీ తెలుగులో మాత్రం మొన్నటిదాకా చిన్మయితోనే చెప్పిస్తుంది.అయితే ఈమధ్య హీరోయిన్స్ కూడా సొంత వాయిస్ ట్రై చేస్తున్నారు.

Advertisement

వారి దారిలోనే సమంత కూడా సొంత వాయిస్ తో ప్రయత్నిస్తుంది.యశోద సినిమా కోసం సమంత చాలా కష్టపడ్డదని తెలుస్తుంది.

ఆమె కష్టం తెర మీద కనబడుతుందని అంటున్నారు.యశోద సినిమాలో సమంత ఒక ప్రెగ్నన్సీ లేడీ పాత్రలో కనిపిస్తుంది.

 ఈ సినిమాను శ్రీదేవి మూవీస్ బ్యానర్ లో శివలెంక కృష్ణప్రసాద్ నిర్మిస్తున్నారు.

అల్లు అర్జున్ అరెస్టు పెద్ద కుట్ర ఉంది.. సింగర్ కల్పన షాకింగ్ కామెంట్స్?
Advertisement

తాజా వార్తలు