సమంత ఫ్యాన్స్ కు గుడ్‌ న్యూస్‌.. ఆమె షూట్స్‌ కి జాయిన్‌ అయ్యేది ఎప్పుడో తెలుసా!

గత కొన్నాళ్లుగా అనారోగ్య సమస్యలతో బాధ పడుతున్న సమంత అతి త్వరలోనే కెమెరా ముందుకు రాబోతుంది.ఈ విషయంలో ఆమె సన్నిహితులు అనధికారికంగా హింట్ ఇచ్చేశారు.

విశ్వసనీయంగా అందుతున్న సమాచారం ప్రకారం సమంత ఈనెల మూడవ వారం లో విజయ్ దేవరకొండ హీరోగా శివ నిర్వాన దర్శకత్వంలో రూపొందుతున్న ఖుషి షూటింగ్‌ లో జాయిన్ అవ్వబోతుందట.ఇప్పటికే సమంత అందుకు సంబంధించి ఓకే చెప్పడం.

ఆమె డేట్లకు అనుసారంగా విజయ్ దేవరకొండ నుండి కూడా డేట్లు తీసుకోవడం జరిగిందట.మొత్తానికి ఖుషి సినిమా ఈ నెల చివర్లో షూట్‌ ప్రారంభం కాబోతుంది.

ఆ వెంటనే శాకుంతలం సినిమా యొక్క ప్రమోషన్ కార్యక్రమాలకు వారం రోజుల పాటు సమంత డేట్లను ఇవ్వడం కూడా అయ్యిందట. శాకుంతలం సినిమా ప్రమోషనల్‌ కార్యక్రమాలు పూర్తి అయిన తర్వాత బాలీవుడ్‌ లో రాజ్ అండ్‌ డీకే దర్శకత్వంలో రూపొందబోతున్న ఒక భారీ వెబ్‌ సిరీస్ లో ఈ అమ్మడు నటించబోతుంది.

Advertisement

ఫిబ్రవరి లో ఆ షూటింగ్ ప్రారంభం అవుతుంది అంటున్నారు.అంతే కాకుండా వరుణ్ దావన్ సినిమా యొక్క షూటింగ్ కార్యక్రమాలు కూడా జరుగుతున్నాయి.సమంత కోసం వెయిట్‌ చేస్తున్న బాలీవుడ్‌ యంగ్‌ హీరో వరుణ్‌ దావన్‌ మార్చి నుండి రెగ్యులర్ షూటింగ్ కు వెళ్లాలి అనుకుంటున్నాడు అంటూ వార్తలు వస్తున్నాయి.

సమంత వల్ల ఆగిపోయిన సినిమాల యొక్క షూటింగ్స్ అన్నీ కూడా మెల్ల మెల్లగా ప్రారంభం కాబోతున్నాయి.సమంత మయో సైటిస్ వ్యాది నుండి బయట పడ్డట్లనే అంటూ వైద్యులు పేర్కొన్నారట.

అందుకే సమంత మళ్లీ షూటింగ్స్ కు హాజరు అయ్యే ఉద్దేశ్యంతో డేట్లు ఇచ్చేసిందని తెలుస్తోంది.ఈ ఏడాది జూన్ వరకు సమంత వరుసగా డేట్లు ఇచ్చేసింది అంటూ సమాచారం అందుతోంది.

సమంత నటించిన మరియు నటిస్తున్న సినిమాలు ఈ ఏడాది కనీసం రెండు మూడు అయినా రావాలని అభిమానులు కోరుకుంటున్నారు.

ఇంట్లోనే సూపర్ సిల్కీ హెయిర్ ను పొందాలనుకుంటే ఇలా చేయండి!
Advertisement

తాజా వార్తలు