నా జీవితంలో ఆ రెండింటికి దూరంగా ఉండాలనుకుంటున్నా...సమంత షాకింగ్ కామెంట్స్!

టాలీవుడ్ క్రేజీ హీరోయిన్ సమంత తాజాగా నటించిన చిత్రం కాతువాక్కుల రెండు కాదల్‌.

ఈ సినిమాని తెలుగులో  కణ్మణి ర్యాంబో ఖతీజా పేరుతో విడుదల చేశారు.

ఖతీజా పాత్రలో సమంత నటించారు.సమంత పుట్టినరోజు సందర్భంగా ఏప్రిల్ 28వ తేదీ ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చింది.

ఇక ఈ సినిమా విడుదలైన సందర్భంగా సమంత ట్విట్టర్ వేదికగా అభిమానులతో ముచ్చటిస్తూ వారు అడిగే ప్రశ్నలకు సమాధానాలు తెలియజేశారు.ఈ సందర్భంగా సమంత పలు షాకింగ్ కామెంట్స్ చేశారు.

ఇకపై తన జీవితంలో ప్రేమ, ద్వేషాలకు దూరంగా ఉంటానని సమంత వెల్లడించారు.అయితే అభిమానులు తనపై చూపించే ప్రేమకు మాత్రం ఎల్లప్పుడూ కృతజ్ఞతతో ఉంటానని సమంత చెప్పుకొచ్చారు.

Advertisement

ఇకపోతే ప్రేక్షకులను నవ్వించడం కోసమే తాను ఈ సినిమాలో ఖతీజాపాత్రలో నటించానని సమంత చెప్పుకొచ్చారు.ప్రతి ఒక్కరు రోజు వారి జీవితంలో కాస్త విరామం ఇచ్చి ఈ సినిమా చూసి హాయిగా నవ్వుకోండి అంటూ ఈ సందర్భంగా సమంత చెప్పుకొచ్చారు.

ఇక ఈ సినిమాలో తనకు  డిప్పం డిప్పం పాట అంటే ఎంతో ఇష్టమని సమంత సందర్భంగా తెలిపారు.ఇక ఈ సినిమా విగ్నేష్ శివన్ దర్శకత్వంలో నయనతార, సమంత, విజయ్ సేతుపతి ప్రధాన పాత్రల్లో నటించారు.ఈ సందర్భంగా సమంత నయనతార గురించి మాట్లాడుతూ.

నయనతార అంటే నయనతారనే తన లాంటి వ్యక్తి మరొకరు ఉండరని,ఆమె సినిమాల పరంగా ఎంతో కష్ట పడే వ్యక్తిత్వం కలవారని సమంత నయనతార గురించి ఎంతో గొప్పగా వెల్లడించారు.

కూతురి పెళ్లి వీడియో షేర్ చేసిన అర్జున్ సర్జా... మాటలు రావడం లేదంటూ పోస్ట్?
Advertisement

తాజా వార్తలు