శబరిమలలో ‘అరవణ ప్రసాదం’ విక్రయాలు నిలిపివేత

శబరిమల ఆలయంలో అందించే అరవణ ప్రసాద విక్రయాలు నిలిచిపోయాయి.

అరవణ ప్రసాదం అమ్మకాలు నిలిపివేయాలంటూ ట్రావెన్ కూర్ దేవస్వోమ్ బోర్డుకు కేరళ హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది.

ప్రసాద తయారీలో వినియోగించే యాలకుల్లో పరిమితికి రసాయన పదార్థాలు ఉంటున్నాయన్న నివేదిక మేరకు హైకోర్టు విక్రయాల నిలిపివేతకు ఉత్తర్వులు ఇచ్చింది.అయితే రసాయన పదార్థాలతో కూడిన యాలకులు కాకుండా తయారు చేసిన ప్రసాదం తయారు చేసి, అమ్ముకోవచ్చని ధర్మాసనం తెలిపింది.

లేదా ఫుడ్ సేఫ్టీ అండ్ స్టాండర్డ్స్ అథారిటీ ఆఫ్ ఇండియా ప్రమాణాలకు అనుగుణంగా కొనుగోలు చేసిన యాలకులతో తయారు చేసిన ప్రసాదాన్ని విక్రయించుకోవచ్చని న్యాయస్థానం స్పష్టం చేసింది.

Betfair Review And Player Reputation (UK) : An Analytical Guide
Advertisement