యూట్యూబ్ ను షేక్ చేస్తున్న డైనో సలార్.. 24 గంటల్లోనే అన్ని మిలియన్ వ్యూస్!

సలార్ మంత్ స్టార్ట్ అయ్యింది.అన్నట్టుగానే డిసెంబర్ 1న ఈ సినిమా ట్రైలర్ ను రిలీజ్ చేసిన విషయం తెలిసిందే.

సలార్ రిలీజ్ అయ్యేందుకు కేవలం 20 రోజులు మాత్రమే ఉంది.దీంతో మేకర్స్ ట్రైలర్ తో ప్రమోషన్స్ కూడా షురూ చేసారు.

ఒక ప్లానింగ్ ప్రకారం ఈ సినిమా ప్రమోషన్స్ ను మేకర్స్ స్టార్ట్ చేసారు.

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ ( Prabhas ) లైనప్ లో కీలకమైన ప్రాజెక్ట్ ఉన్న లేటెస్ట్ పాన్ ఇండియన్ మూవీ ఏది అంటే సలార్.సెన్సేషనల్ డైరెక్టర్ ప్రశాంత్ నీల్ ( Prashanth Neel ) దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ భారీ బడ్జెట్ రిలీజ్ కు సిద్ధం అయ్యింది.ఈ సినిమాను క్రిస్మస్ కానుకగా వరల్డ్ వైడ్ గా డిసెంబర్ 22న రిలీజ్ చేయనున్నారు.

Advertisement

మొన్న డిసెంబర్ 1న ట్రైలర్ రావడంతో ఇది ప్రతీ ఒక్కరిని అలరిస్తుంది.యూట్యూబ్ ను సైతం షేక్ చేసేలా సలార్ డైనో పంజా విసురుతుంది.ప్రభాస్ క్రేజ్ ఎలాంటిదో ఈ సలార్ ట్రైలర్ స్తుష్టిస్తున్న ట్రెండ్ ను బట్టి అర్ధం అవుతుంది.

ట్రైలర్ తర్వాత ఈ సినిమా విషయంలో ఫ్యాన్స్ మరింత ఎగ్జైటింగ్ గా మారారు.

ఈ సలార్ ట్రైలర్ తాజాగా యూట్యూబ్ లో రికార్డ్ క్రియేట్ చేసింది.24 గంటల్లోనే ఏకంగా 110 మిలియన్ వ్యూస్ ను క్రాస్ చేసింది.అన్ని లాంగ్వేజ్ లు కలిపి ఈ రికార్డ్ క్రియేట్ చేయగా యూట్యూబ్ సైతం షేక్ అవుతుంది.

కాగా ఈ సినిమాలో శృతి హాసన్ ( Shruti Haasan ) హీరోయిన్ గా నటిస్తుండగా.హోంబలే వారు భారీ స్థాయిలో హాలీవుడ్ రేంజ్ లో సినిమాను నిర్మిస్తున్నారు.

Marathon: Atención Al Cliente Y Calidad Del Servicio — Guía Práctica Para Jugadores De Arg...
Felix Spin — Die Besten Spiele Und Slots Im Vergleich

అలాగే రవి బసృర్ సంగీతం అందించిన ఈ సినిమాలో మాలీవుడ్ స్టార్ హీరో పృథ్వీ రాజ్ సుకుమారన్, జగపతిబాబు కీ రోల్స్ పోషించారు.మరి ఇదైనా డార్లింగ్ ఫ్యాన్స్ ను ఖుషీ చేస్తుందో లేదో చూడాలి.

Advertisement
https://youtu.be/4GPvYMKtrtI

తాజా వార్తలు