పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ చేతిలో ప్రెసెంట్ నాలుగైదు పాన్ ఇండియా సినిమాలు ఉన్నాయి.అందులో సలార్ సినిమా ఒకటి.
కేజిఎఫ్ డైరెక్టర్ ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో ఈ సినిమా తెరకెక్కుతుంది.ఈ సినిమాను హోంబళ్లే ప్రొడక్షన్ బ్యానర్ పై విజయ్ కిరగందుర్ నిర్మిస్తుండగా.
శృతి హాసన్ హీరోయిన్ గా నటిస్తుంది.ప్రెసెంట్ ప్రభాస్ అభిమానులు ఈ సినిమాపై మరింత ఆసక్తిని పెంచుకుంటున్నారు.
ఈ సినిమా సంక్రాంతి 2022 లోనే రిలీజ్ చేస్తామని చెప్పారు.కానీ ఈ సంక్రాంతి పోయింది.
ఇక ఇప్పుడు 2023 లో అయినా రిలీజ్ చేస్తారా అనే అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి.తాజాగా ఈ సినిమా విడుదల విషయంలో మేకర్స్ క్లారిటీ ఇచ్చారు.
ఈ సినిమా నిర్మాత తాజాగా జరిగిన ఇంటర్వ్యూ లో సలార్ సినిమాపై ఆసక్తికర వ్యాఖ్యలు చేసాడు.సలార్ సినిమా 30 శాతం షూటింగ్ పూర్తి అయ్యింది.
మిగిలిన షూటింగ్ మే నెలలో స్టార్ట్ అవుతుంది.
ఈ ఏడాది చివరి లోపు ఈ సినిమాను పూర్తి చేస్తాం.ఎట్టిపరిస్థితుల్లో ఈ సినిమా 2023 ఏప్రిల్ లో కానీ, జూన్ లో కానీ రిలీజ్ చేస్తాం అంటూ నిర్మాత చెప్పుకొచ్చాడు దీంతో ఈ సినిమా కోసం ఎదురు చూసే ప్రేక్షకులకు ఒక క్లారిటీ వచ్చింది.
ఈ ఏడాది ఈ సినిమా రిలీజ్ కాదు అని తెలిసిన ఫ్యాన్స్ నిరాశ వ్యక్తం చేస్తున్నారు.రిలీజ్ డేట్ వచ్చే ఏడాదికి కన్ఫర్మ్ చేయడంతో అప్పటి కోసం ఎదురు చూస్తున్నారు.గత ఏడాది మొదలు పెట్టిన ఈ షూటింగ్ ఇప్పటికి ఇంకా 30 శాతం మాత్రమే పూర్తీ అవ్వడంతో నీల్ ఈ సినిమాను బాగా చెక్కుతున్నాడు అని అర్ధం అవుతుంది.
ఈ సినిమా నుండి వచ్చిన లుక్ చూసి ప్రభాస్ మాస్ అవతారములో దర్శనం ఇవ్వనున్నాడు అని ఇప్పటికే తెలిసిందే.దీంతో ఈ సినిమా కోసం ఆతృతగా ఎదురు చూస్తున్నారు.
తాజా వార్తలు
Download App
Channels
HomeEnglish NewsTeluguStop Exclusive StoriesFlash/Breaking NewsTrending NewsPoliticalMovieHealth TipsCrime NewsMovie ReviewsNRI NewsViral VideosBhakthi/DevotionalPress ReleasesViral StoriesQuotesPhoto TalksBaby Boy NamesBaby Girl NamesCelebrity ProfilesFollow Us!
Contact Us!
TeluguStop.com Media, Siya Residency, Sri Sri Circle, Khammam, Telangana- 507002info@telugustop.comPh No : 999-279-9973
About Us!
About UsJobsAdvertisingDMCA / RemovalTerms of UsePrivacy Policy