ష‌ర్మిల‌ను లైట్ తీస్కొన్న సాక్షి... కొత్త ఛానెల్ రెఢీ ?

తెలంగాణ రాజ‌కీయాల్లోకి రీ ఎంట్రీ ఇవ్వ‌డంతో పాటు కొత్త పార్టీ ఏర్పాటుపై వైఎస్‌.ష‌ర్మిల దాదాపు సంకేతాలు ఇచ్చేస్తున్నారు.

నిన్న ఉమ్మ‌డి న‌ల్ల‌గొండ జిల్లాకు చెందిన పార్టీ నేత‌ల‌తో ఆమె స‌మావేశం అవ్వ‌డంతో పాటు వారి అభిప్రాయాలు తీసుకున్నారు.ఏపీ సీఎం జ‌గ‌న్మోహ‌న్ రెడ్డి సోద‌రిగా ఉన్న ష‌ర్మిల కొత్త పార్టీ పెడుతుండ‌డంతో నిన్న మీడియా అటెన్ష‌న్ అంతా ఆమె వైపే ఉంది.

ఓ వైపు ఏపీలో స్థానిక సంస్థ‌ల ఎన్నిక‌ల తొలి ద‌శ పోలింగ్ జ‌రుగుతున్నా కూడా అంద‌రి దృష్టి కూడా ష‌ర్మిల పార్టీ మీదే ఉంది.మీడియా అంతా ష‌ర్మిల కొత్త పార్టీ స‌న్నాహ‌క స‌మావేశాన్నే హైలెట్ చేసింది.

ఒక్క సాక్షి మీడియా మాత్రం ష‌ర్మిల‌కు ఏ మాత్రం క‌వ‌రేజ్ ఇవ్వ‌లేదు.ఇక గ‌తంలో ష‌ర్మిల జ‌గ‌న్ కోసం, వైసీపీ కోసం పాద‌యాత్ర చేసిన‌ప్పుడు ఇదే సాక్షి మీడియా ఆమెకు బ్ర‌హ్మ‌ర‌థం ప‌ట్టింది.

Advertisement
Sakshi Took Sharmila To Lite New Channel Ready, Ap,ap Political News,latest News

ఆ త‌ర్వాత ఆమెను పూర్తిగా మ‌ర‌చిపోయింది.జ‌గ‌న్ సీఎం అయ్యాక ఆమెకు పార్టీలోనూ.

సాక్షి మీడియాలోనూ క్ర‌మ‌క్ర‌మంగా ప్రాధాన్య‌త త‌గ్గుతూ వ‌చ్చింది.వైసీపీ అధిష్టానం నుంచి వ‌చ్చిన ఆదేశాల మేర‌కే ఆమెను సాక్షి మీడియా ఆమెను ప‌ట్టించుకోవ‌డం లేద‌ని తెలుస్తోంది.

Sakshi Took Sharmila To Lite New Channel Ready, Ap,ap Political News,latest News

ఈ క్ర‌మంలోనే ఆమె త‌న వాయిస్ కోస‌మే మీడియారంగంలోకి ఎంట్రీ ఇవ్వ‌డంతో పాటు ఓ కొత్త ఛానెల్ కూడా పెడుతున్న‌ట్టు తెలుస్తోంది.ఈ ఛానెల్ వెన‌క టీవీ 9 మాజీ సీఈవో కీల‌క పాత్ర పోషిస్తున్నార‌ని తాజాగా వెలుగు చూసింది.రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ ష‌ర్మిల వాయిస్ బ‌లంగా వినిపించే క్ర‌మంతో పాటు అటు సువార్త ప్ర‌సంగీకుడు బ్ర‌ద‌ర్ అనిల్ కుమార్‌ను హైలెట్ చేసేలా ఈ ఛానెల్ కీల‌కంగా ఉండ‌బోతోంద‌ని స‌మాచారం.

తాజా వార్తలు