లోకేష్ పై సజ్జల రామకృష్ణారెడ్డి సీరియస్ వ్యాఖ్యలు..!!

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయాలు నువ్వా నేనా అన్నట్టుగా ఉన్నాయి.

వచ్చే ఎన్నికలకు ఇంకా ఏడాది కూడా టైం లేకపోవడంతో ప్రతిపక్షాలు అధికార పార్టీపై తీవ్రస్థాయిలో విమర్శలు ఆరోపణలు చేస్తున్నాయి.

ఇదే సమయంలో ఎవరికివారు పలు కార్యక్రమాలు చేపడుతూ ప్రజా సమస్యలపై వైసీపీ పార్టీని నిలదీస్తున్నారు.ప్రస్తుతం టీడీపీ నేత లోకేష్( Nara lokesh ) పాదయాత్ర చేస్తున్న సంగతి తెలిసిందే.

జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ మొన్నటి వరకు వారాహి యాత్ర చేపట్టడం జరిగింది.ఈ యాత్రలలో వైసీపీ పాలనపై తీవ్రస్థాయిలో పరుష పదజాలంతో విమర్శలు చేస్తూ ఉన్నారు.

ఇదిలా ఉంటే తాజాగా ప్రభుత్వ సలహాదారుడు సజ్జల రామకృష్ణారెడ్డి ( Sajjala Ramakrishna Reddy)లోకేష్ పై సీరియస్ వ్యాఖ్యలు చేశారు.ప్రభుత్వంపై చేస్తున్న విమర్శలకు కౌంటర్ ఇచ్చారు.

Advertisement

లోకేష్ కి పీకడం అనే మాట తప్ప ఏమీ రాదని విమర్శించారు.తెలుగుదేశం పార్టీకి( TDP ) దింపడు కళ్లెం ఆశ తప్ప ఏమీ లేదని వ్యాఖ్యానించారు.

టీడీపీని ప్రజలు ఇకలు ఊడిన కోడిలా చేశారని అన్నారు.మరో 5 ఏళ్ల పాటు దేశంలోనే వైసీపీ పాలన అగ్రగామిగా ఉంటుందని ఏ ఎన్నికలొచ్చినా వైసీపీదే విజయం అని వ్యాఖ్యానించారు.

Advertisement