ఉద్యోగ సంఘాలు చేస్తోన్న మూడు డిమాండ్లకు కాలం చెల్లింది.. సజ్జల రామకృష్ణారెడ్డి

అమరావతి: ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి మాట్లాడుతూ.ఉద్యోగ సంఘాలు చేస్తోన్న మూడు డిమాండ్లకు కాలం చెల్లింది.

ఇప్పటికే ఉద్యోగుల అకౌంట్లల్లో వేతనాలు పడ్డాయి.రెండు డిమాండ్లు నెరవేర్చడం సాధ్యపడదు.

మిగిలిన డిమాండ్ అయిన పీఆర్సీ రిపోర్టు ఇవ్వడం వల్ల లాభం లేదు.పట్టుబట్టే బదులు ప్రధాన సమస్యలపై చర్చలకు రావాలని అడిగాం.

డిమాండ్లు తీర్చడానికి అవకాశం లేని పరిస్థితి ఇప్పుడు ఉంది.నిన్న సాయంత్రం, ఇవాల ఉదయం ఉద్యోగ సంఘాల నేతలతో మాట్లాడారు.

Advertisement
Sajjala Ramakrishna Reddy Comments On Ap Govt Employees Prc Demands Details, Saj

ఉద్యోగ సంఘాలు అసలు సమస్యలపై మాట్లాడేందుకు రావాలని కోరాం.కార్యాచరణ వాయుదా వేసుకోవాలని కోరాం.

ఇప్పటి వరకు నేతల నుంచి ఎలాంటి స్పందన రాలేదు.రేపు ఉద్యోగులు చేసేది బల ప్రదర్శనే.

వైషమ్యం పెంచుకోవడం ద్వారా ఏం చేస్తారు.? ఆందోళనలో సంఘ విద్రోహ శక్తులు చొరబడే ప్రమాదం ఉంది.ఆందోళనపై ఉద్యోగ సంఘాల నాయకులు ఒకసారి ఆత్మ విమర్శ చేసుకోవాలి.

సీపీఎస్, అవుట్ సోర్సింగ్ ఒక పట్టాన తెగేవి కాదు.ఆర్టీసీ వారి సమస్యలు పరిష్కారానికీ చర్యలు తీసుకుంటుండగానే వారినీ తీసుకువచ్చారు.

నెలలో రెండుసార్లు ఈ రెమెడీని పాటిస్తే 60 లోనూ తెల్ల జుట్టు దరిచేరదు!

ఆర్టీసీ ని ప్రభుత్వంలో కలిపినా ఆందోళన చేస్తామంటున్నారు.ప్రభుత్వం ఆర్టీసీ ఉద్యోగులపై అభిమానంతోనే విలీనం చేశారు.

Advertisement

ఆర్టీసీ వారిని కూడా తీసుకు వచ్చి,బస్సులు ఆపి బల ప్రదర్శన చేయాలని చూస్తున్నారు.బలం పెంచుకునేందుకు ఆర్టీసీ వారినీ తీసుకొచ్చి ఆందోళన చేయిస్తున్నారు.

ప్రభుత్వం ప్రజలకు ఇబ్బందులు కలగ కుండా చర్యలు తీసుకుంటుంది.ప్రజల ఇబ్బంది తొలగించడం ప్రభుత్వం బాధ్యత.

ఉద్యోగులపై చర్యలు తీసుకునే పరిస్థితి కి తెచ్చుకోవద్దని కోరుతున్నా.ఉద్యోగులకు ఏ విధంగా చూసినా వేతనం కచ్చితంగా పెరుగుతుంది.కోవిడ్ వల్ల రాష్ట్ర ఆర్థిక పరిస్థితి బాగాలేదని చెబుతున్నాం.

ఉద్యోగులు తమ సమస్యలను సీఎం దృష్టికి తీసుకెళ్లి పరిష్కరించే ప్రయత్నం చేస్తాం.ఇప్పుడు వెలగపూడి నుంచే పరి పాలన సాగుతుంది.

టెక్నికల్ గా ప్రస్తుతం పాలన ఎక్కడినుంచి జరుగుతుందో అదే ప్రస్తుత రాజధాని అవుతుంది.భవిష్యత్తులో రాజధాని మార్పు ఉంటుంది.

కేంద్రం బడ్జెట్ లో ఏటా రాష్ట్రానికి అన్యాయమే చేస్తున్నారు.కేంద్ర బడ్జెట్ లో ఈ సారి కూడా రాష్ట్రానికి అన్యాయమే జరిగింది.

ఉద్యోగుల సమస్యల పై ప్రభుత్వం వెనక్కి తగ్గేది లేదని చెప్పడం లేదు.మార్పులకు అవకాశం ఎప్పుడూ ఉంటుంద.

చర్చలకు వచ్చి పరిష్కరించు కోవాలని ఉద్యోగులను కోరుతున్నాం.గతంలో టీడీపీ బీజేపీ తో పార్ట్ నర్ గా ఉన్నా రాష్ట్రానికి అన్యాయం చేశారు.

జగన్ వల్లే ప్రత్యేక హోదా సజీవంగా ఉంది. రాజ్యాంగాన్ని మార్చాల్సిన అవసరం ఉందన్న కేసీఆర్ వ్యాఖ్యల వల్ల పబ్లిక్ ఒపీనియన్ తెలుసుకోవచ్చు.

రాజ్యాంగాన్ని మార్చాల్సిన అవసం కూడా ఉండొచ్చు.దీనిపై చర్చ జరగాలి.

తాజా వార్తలు