చంద్రబాబుపై ప్రభుత్వ సలహాదారు సజ్జల ఫైర్

టీడీపీ అధినేత చంద్రబాబుపై ఏపీ ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి మండిపడ్డారు.చంద్రబాబుకి 175 నియోజక వర్గాలకు అభ్యర్థులు ఉన్నారా అని ప్రశ్నించారు.

చంద్రబాబు, పవన్ కల్యాణ్, లోకేశ్ అంతా పక్క రాష్ట్రంలో ఉంటూ ఏపీలో పెత్తనం చేయాలనుకుంటున్నారని సజ్జల ఆరోపించారు.లోకేశ్ మళ్లీ రూ.3 వేలు నిరుద్యోగ భృతి ఇస్తామంటున్నారన్న ఆయన గతంలో నిరుద్యోగ భృతి రూ.2 వేలు ఇస్తామని ఇచ్చారా అని ప్రశ్నించారు.తమకు వణుకుపుడితే బస్సు యాత్ర చేస్తామా అని అడిగారు.

కాకినాడ వైద్యుడు బలవన్మరణంతో వైసీపీ నేతలకు ఏమి సంబంధమని ప్రశ్నించారు.చనిపోయిన వ్యక్తి తల్లే వైసీపీ నేతలకు సంబంధం లేదని చెబుతోందన్నారు.

టీడీపీ, జనసేన చిల్లర రాజకీయాలకు ఇదే నిదర్శనమని సజ్జల వెల్లడించారు.

Advertisement
మీకు తెలుసా : ఉప్పు ఎక్కువ తింటున్నారా అయితే తస్మాత్‌ జాగ్రత్త

తాజా వార్తలు