నాకు రాసిపెట్టి లేదు.. ఆ పాత్రలపై షాకింగ్ కామెంట్స్ చేసిన సాయిపల్లవి!

స్టార్ హీరోయిన్ సాయిపల్లవి అభినయ ప్రధాన పాత్రలతో ప్రేక్షకుల హృదయాలను గెలుచుకోవడంతో పాటు లేడీ ఓరియెంటెడ్ ప్రాజెక్ట్ ల ద్వారా కూడా సత్తా చాటుతున్నారు.

అయితే ప్రతి హీరోయిన్ సినీ కెరీర్ లో కొన్ని మిస్సైన పాత్రలు ఉంటాయి.

ఆ పాత్రలలో నటించి ఉంటే తాము మరింత అద్భుతంగా నటించి ఉండేవాళ్లమని హీరోయిన్లు కొన్ని సందర్భాల్లో భావిస్తుంటారు.అయితే ఆ తరహా పాత్రల గురించి, రిజెక్ట్ చేసిన పాత్రల గురించి సాయిపల్లవి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.

తాను మిస్ చేసుకున్న పాత్రల విషయంలో నేనేం బాధ పడనని ఆమె కామెంట్లు చేశారు.తాను ఆ పాత్ర చేయాలని రాసిపెట్టి లేదని ఆ రీజన్ వల్లే పాత్ర మిస్ అయిందని భావిస్తానని సాయిపల్లవి పేర్కొన్నారు.

తాను విధిని గుడ్డిగా నమ్ముతానని సాయిపల్లవి అభిప్రాయం వ్యక్తం చేయడం గమనార్హం.సాయిపల్లవికి ఈ మధ్య కాలంలో సరైన సక్సెస్ దక్కడం లేదనే సంగతి తెలిసిందే.

Advertisement

వరుసగా సాయిపల్లవి నటించిన సినిమాలు బాక్సాఫీస్ వద్ద ఫ్లాప్ రిజల్ట్ ను అందుకుంటూ ఉండటంతో ఆమెకు సినిమా ఆఫర్లు తగ్గాయి.అయితే ఎంతమంది హీరోయిన్లు ఉన్నా ఆ హీరోయిన్లలో తాను ప్రత్యేకం అని సాయిపల్లవి ప్రూవ్ చేసుకున్నారు.

రెమ్యునరేషన్ కంటే విలువలకే సాయిపల్లవి ఎక్కువగా ప్రాధాన్యత ఇచ్చారు.సాయిపల్లవి ఒక్కో సినిమాకు 2 కోట్ల రూపాయల రేంజ్ లో రెమ్యునరేషన్ తీసుకుంటున్నారు.చాలామంది హీరోయిన్లతో పోల్చి చూస్తే సాయిపల్లవి రెమ్యునరేషన్ తక్కువే కావడం గమనార్హం.

సాయిపల్లవి రేంజ్ అంతకంతకూ పెరుగుతున్న సంగతి తెలిసిందే.సక్సెస్ ఫెయిల్యూర్ తో సంబంధం లేకుండా సాయిపల్లవి కెరీర్ ను కొనసాగిస్తున్నారు.

సోషల్ మీడియాలో సాయిపల్లవి యాక్టివ్ గా ఉండటానికి పెద్దగా ఇష్టపడరనే సంగతి తెలిసిందే.సినిమాలు ఫ్లాప్ అవుతున్నా సాయిపల్లవిని అభిమానించే అభిమానుల సంఖ్య ఏ మాత్రం తగ్గడం లేదు.

Felix Spin — Die Besten Spiele Und Slots Im Vergleich
Advertisement