ఆ దేశంలో ఇల్లు కొనుగోలు చేసిన సైఫ్ అలీ ఖాన్.. వాళ్లకు భారీ షాకిచ్చాడుగా!

బాలీవుడ్ స్టార్ హీరో సైఫ్ అలీ ఖాన్ (Bollywood star hero Saif Ali Khan)ఒకవైపు సినిమాలలో నటిస్తూనే మరొకవైపు తరచూ ఏదోక విషయంతో వార్తలు నిలుస్తూనే ఉంటారు.

ఇటీవల కాలంలో తరచుగా ఆయన పేరు సోషల్ మీడియాలో వినిపిస్తూనే ఉంది.

అందులో భాగంగానే ఇటీవల ఈ ఏడాది ప్రారంభంలో ఒక దుండగుడు దాడిలో సైఫ్ అలీ ఖాన్ గాయపడిన విషయం తెలిసిందే.ఆ విషయం బాలీవుడ్ ఇండస్ట్రీ తో పాటు అన్ని ఇండస్ట్రీలో సంచలనంగా మారింది.

ఇప్పుడిప్పుడే నెమ్మదిగా కోలుకున్నారు.అయితే ఈ సంఘటన జరిగిన దాదాపు మూడు నెలల్లోనే మరొక ఇల్లు కొనుగోలు చేశారు సఫ్ అలీ ఖాన్.

ఖతర్ లో ఒక విలాసవంతమైన ఇల్లు కొనుగోలు చేశారు.ఇది ఇలా ఉంటే తాజాగా ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్న సైఫ్ అలీ ఖాన్ ఖతర్ కొత్త ఇల్లు(Saif Ali Khans new house in Qatar) కొనుగోలు చేయడం వెనుక ఉన్న కారణం గురించి తెలిపారు.ఈ సందర్భంగా సైఫ్ మాట్లాడుతూ.

Advertisement

అది నా హాలీడే హోమ్‌.అక్కడ ఇల్లు కొనడానికి కొన్ని కారణాలు ఉన్నాయి.

నాకు ప్రయాణం సులువు అవుతుంది.రెండోది అన్నిటికంటే ముఖ్యమైనది ఆ ప్రాంతం నాకు సురక్షితంగా అనిపించింది.

ఖతర్‌(Qatar) విలాసవంతమైన, అందమైన దేశం.అక్కడ ఉన్నప్పుడు చాలా ప్రశాంతమైన అనుభూతి కలుగుతుంది.

ఆ ప్రాంతంలో ఉన్నన్ని రోజులు నా ఆహారం, జీవనశైలి అన్నీ మారిపోతాయి.అక్కడ ఒక ఇంటికి, మరో ఇంటికి చాలా దూరం ఉంటుంది.నేను ఇటీవల షూటింగ్‌ కోసం అక్కడికి వెళ్లినపుడు ఆ వాతావరణం అద్భుతంగా అనిపించింది.

మచ్చలు పోయి ముఖం తెల్లగా మారాలా.. అయితే ఈ రెమెడీని మీరు ట్రై చేయాల్సిందే!

దీంతో అక్కడ ఇల్లు కొన్నాను.నా కుటుంబాన్ని అక్కడికి షిఫ్ట్‌ చేసే రోజు కోసం ఎదురుచూస్తున్నాను అని ఆయన చెప్పుకొచ్చారు.

Advertisement

ఈ సందర్భంగా సైఫ్ అలీ ఖాన్ (Saif Ali Khan)చేసిన వాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.ఇకపోతే సైఫ్‌ అలీఖాన్‌ పై జనవరి 16న గుర్తు తెలియని దుండగుడు దాడికి పాల్పడిన విషయం తెలిసిందే.

దీని పై కేసు నమోదు చేసుకున్న ముంబయి పోలీసులు బంగ్లాదేశ్‌ కు చెందిన మహ్మద్ షరీఫుల్ ఇస్లాం షెహజాద్‌ ను అరెస్ట్‌ చేసి విచారించారు.రూ.30 వేల కోసం అతడు సైఫ్‌పై దాడి చేసినట్లు వెల్లడించాడు.

తాజా వార్తలు