అవుట్ పుట్ పై సాయి ధరం తేజ్ అసంతృప్తి..

మెగా హీరోల్లో మస్త్ జబర్దస్త్ ఫాంలో ఉన్న హీరో సాయి ధరం తేజ్.

చేసిన నాలుగైదు సినిమాలతోనే సుప్రీం స్టార్ గా క్రేజ్ సంపాదించిన మెగా మేనళ్లుడు ప్రస్తుతం తాను చేస్తున్న ప్రాజెక్ట్ మీద అసంతృప్తిగా ఉన్నాడట.

సాయి ధరం చేతిలో ప్రస్తుతం ఉన్న సినిమాలు ఒకటి సునీల్ రెడ్డి తిక్క మరోటి గోపిచంద్ మలినేని సినిమా.తిక్క ఆల్మోస్ట్ కంప్లీట్ అయ్యింది ఇక వచ్చే నెలలో రిలీజ్ కూడా అంటున్నారు.

అయితే మలినేని గోపిచంద్ సినిమాపై మాత్రం సాయి ధరం అంత సాటిస్ఫైడ్ గా లేదన్నది టాక్.తండ్రి సెంటిమెంట్ తో వస్తున్న ఈ సినిమా ఎక్కడో ట్రాక్ తప్పిందని అంటున్నారు.

అందుకే ఇప్పుడు సినిమాలోకి వెలిగొండ శ్రీనివాస్ ఎంట్రీ ఇచ్చి దాన్ని సరిదిద్దుతున్నాడట.సినిమా చేస్తున్న అవుట్ పుట్ అంత బాగా రాకపోవడంతో గోపిచంద్ మలినేని, సాయి ధరం తేజ్ లు చర్చించుకుని వెలిగొండ శ్రీనివాస్ సహకారం తీసుకున్నారట.

Advertisement

సో అతని హ్యాండ్ తో మళ్లీ సినిమా సెట్ రైట్ అవుతుందని అంటున్నారు.మరి ఇలా జాగ్రత్తలు తీసుకుంటున్నాడు కాబట్టే సాయి ధరం తేజ్ సినిమా సినిమాకు స్టార్ గా ఎదుగుతున్నాడని అనిపిస్తుంది.

రీసెంట్ గా రిలీజ్ అయిన సుప్రీమ్ సినిమా కెరియర్ లో హయ్యెస్ట్ కలెక్షన్స్ సాధించిన మూవీగా సాయి ధరం తేజ్ తన ఖాతాలో అదిరిపోయే హిట్ వేసుకున్నాడు.

Advertisement

తాజా వార్తలు