ఎన్టీఆర్ కు ఛాలెంజ్ విసురుతున్న సాయి పల్లవి.. ఏ విషయంలో అంటే?

టాలీవుడ్ యంగ్ టైగర్ ఎన్టీఆర్ ట్రిపుల్ ఆర్ సినిమాతో నాలుగేళ్ళ తర్వాత ప్రేక్షకుల ముందుకు వచ్చి మంచి హిట్ అందుకున్నాడు.

దీంతో నందమూరి అభిమానులు ఫుల్ ఖుషీగా ఉన్నారు.

అయితే ఇది మల్టీ స్టారర్ కావడంతో ఈ సినిమా విజయం ఎన్టీఆర్ ది ఒక్కడిదే కాదు.కాబట్టి ఇప్పుడు తారక్ ఫ్యాన్స్ ఎన్టీఆర్ 30వ సినిమా కోసమే ఎదురు చూస్తున్నారు.

మరి ఎన్టీఆర్ ఈ సినిమా భారీ విజయం తర్వాత కొరటాల శివ తో సినిమా చేయనున్నాడు.అయితే ఇప్పటి వరకు ఈ సినిమా సెట్స్ మీదకు వెళ్లలేదు.

మొన్న బర్త్ డే జరుపుకున్న నేపథ్యంలో NTR30 నుండి కొరటాల మోషన్ పోస్టర్ వదిలి ఈ సినిమాపై మరిన్ని అంచనాలను పెంచేసాడు.ఆచార్య ప్లాప్ ను ఈ సినిమా హిట్ తో తుడిచి పెట్టుకు పోవాలని చాలా కష్టపడుతున్నాడు కొరటాల.

Advertisement
Sai Pallavi To Challenge Jr. NTR In NTR30, Jr NTR , Koratala Siva , NTR30 , Youn

పాన్ ఇండియా సినిమాగా తెరకెక్కనున్న ఈ సినిమాకు అనిరుద్ సంగీతం అందిస్తుండగా ఎన్టీఆర్ ఆర్ట్స్ బ్యానర్ పై ఈ సినిమాను నిర్మిస్తున్నారు.అయితే తాజాగా ఈ సినిమాపై ఒక అప్డేట్ బయటకు వచ్చింది.

ఈ సినిమా ప్రకటించినప్పటి నుండి ఈ సినిమాలో నటించబోయే హీరోయిన్ గురించి ఏదొక వార్త వస్తూనే ఉంది.ఈ సినిమాలో టాలీవుడ్ భామలతో పాటు బాలీవుడ్ భామల పేర్లు చాలా వినిపించాయి.

Sai Pallavi To Challenge Jr. Ntr In Ntr30, Jr Ntr , Koratala Siva , Ntr30 , Youn

ఇక ఇటీవల ఈ సినిమాలో ఎన్టీఆర్ కు జోడీగా సాయి పల్లవి నటిస్తుంది అనే వార్తలు వచ్చిన విషయం విదితమే.మేకర్స్ కూడా ఇప్పుడు ఉన్న హీరోయిన్ లలో బెస్ట్ పెర్ఫెర్మెన్స్ ఇచ్చే హీరోయిన్ ఈమెనే అవ్వడంతో ఎన్టీఆర్ కు జోడీగా బాగుంటుంది అని అనుకుంటున్నారట.ఈమెను ఫైనల్ చేసారని కూడా వార్తలు వస్తున్నాయి.

అయితే ఇప్పుడు ఎన్టీఆర్ కు సాయి పల్లవి ఒక ఛాలెంజ్ విసురుతుంది.

Sai Pallavi To Challenge Jr. Ntr In Ntr30, Jr Ntr , Koratala Siva , Ntr30 , Youn
Jyothamma Jabardast : మానవత్వం మర్చిపోయిన ఓ సమాజమా ..అగ్గి తో కడగాలి నిన్ను !

ఈమె నటన ఎంతబాగా చేస్తుందో డ్యాన్స్ కూడా అంతే బాగా చేస్తుంది అనే విషయం విదితమే.ఈ అమ్మడి సినిమాల్లో నటించే హీరోలు ఈ అమ్మడితో పోటీగా డ్యాన్స్ చేయడం కోసం కష్టపడుతుంటారు.కానీ ఆమెకు ధీటుకు చేయాలంటే మాములు విషయం కాదు.

Advertisement

ఇక ఇప్పుడు తారక్ కు కూడా ఈ అమ్మడు ఛాలెంజ్ విసురుతున్నట్టు తెలుస్తుంది.మరి ఎన్టీఆర్ కూడా టాలీవుడ్ బెస్ట్ డ్యాన్సర్ కావడంతో వీరిద్దరి డ్యాన్స్ హోరాహోరీగా సాగుతుంది అనడంలో ఎలాంటి సందేహం లేదు.

తాజా వార్తలు