తెలుగు సినిమాలు చేయనంటున్న సాయి పల్లవి

ఫిదా సినిమా( Fidaa Movie ) తో తెలుగు ప్రేక్షకులను ఫిదా చేసిన ముద్దుగుమ్మ సాయి పల్లవి తెలుగు లో పలు సినిమాల్లో నటించిన సాయి పల్లవి చివరగా విరాటపర్వం( Virataparvam ) సినిమాలో కనిపించింది.

ఆ సినిమా లో అద్భుతమైన నటన తో ఆకట్టుకుంది.

నిజ జీవిత సంఘటనల ఆధారంగా రూపొందిన సినిమా మంచి విజయాన్ని సొంతం చేసుకుంది.కమర్షియల్ గా భారీ వసూళ్లు రాబట్ట లేక పోయినా కూడా సాయి పల్లవి కి రానా కి మంచి మూవీ గా నిలిచింది అనడం లో సందేహం లేదు.

అలాంటి సినిమా తర్వాత సాయి పల్లవి ఇప్పటి వరకు కొత్త సినిమా ను కమిట్ అవ్వలేదు.ఇతర భాషల్లో కూడా సాయి పల్లవి( Sai Pallavi ) గతం తో పోలిస్తే వరుస సినిమాలను కమిట్ అవడం లేదు.

సాయి పల్లవి ఎందుకు సినిమాలు కమిట్ అవ్వడం లేదు అని ఎందుకు సమాధానం లేదు.అయితే ఇతర భాషల్లో అడపా దడప్ప సినిమాలు చేస్తున్న ఈ ముద్దుగుమ్మ తెలుగు విషయానికి వస్తే అస్సలు తగ్గడం లేదు.టాలీవుడ్( Tollywood ) లో సినిమాలు చేయాలని ఆసక్తి తనకు లేదు అంటూ చెప్పేస్తుంది.

Advertisement

అన్ని భాషల్లోకి తెలుగు ప్రేక్షకులు మాత్రమే అత్యధికంగా సాయి పల్లవి ని అభిమానిస్తారు అనే విషయం ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు.తెలుగు ప్రేక్షకులు సాయి పల్లవి ని లేడీ పవర్ స్టార్( Lady Powerstar ) అంటూ పిలుచుకుంటారు.

అలాంటి అభిమానుల కోసం తెలుగు లో ఒక సినిమా చేస్తే బాగుంటుంది కదా అంటూ కొందరు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.

కానీ సాయి పల్లవి మాత్రం తెలుగు లో సినిమాలు చేయను అంటూ చెప్పేస్తోంది.తెలుగు లో కనీసం వచ్చే సంవత్సరం లో అయిన సాయి పల్లవి సినిమా చేస్తుందేమో చూడాలి.అసలు సాయి పల్లవి సినిమాల సంఖ్య తగ్గించడానికి కారణం ఏంటి అనేది తెలియాలంటే మరికొన్ని వెయిట్ చేయాల్సిందే.

ఒకవైపు ఆమె సోదరీ కూడా హీరోయిన్గా పరిచయం కాబోతుందని అన్నారు.కానీ ఇప్పుడు ఇద్దరి సినిమాలు కూడా ఎక్కడా కనిపించడం లేదు అసలు మేటర్ ఏంటో.!.

కీర్తి సురేష్ పెళ్లి చీర కోసం అన్ని గంటలు కష్టపడ్డారా.. ఆ చీర ప్రత్యేకత ఏంటో తెలుసా?
Advertisement

తాజా వార్తలు