సోదరి పెళ్లిలో డ్యాన్స్ తో ఫిదా చేసిన సాయిపల్లవి.. ఈ బ్యూటీ డ్యాన్స్ సూపర్ అంటూ?

తెలుగు సినీ ప్రేక్షకులకు హీరోయిన్ సాయి పల్లవి ( Heroine Sai Pallavi )గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు.

సాయి పల్లవి ప్రస్తుతం వరుసగా సినిమాలలో నటిస్తూ ఫుల్ బిజీ బిజీగా ఉన్న విషయం తెలిసిందే.

తెలుగుతో పాటు ఇతర భాషల సినిమాలలో కూడా నటిస్తూ ఫుల్ బిజీ బిజీగా గడుపుతోంది ఈ ముద్దుగుమ్మ.ప్రస్తుతం ఈమె తెలుగులో నాగచైతన్య సరసన తండేల్( Tandel ) సినిమాలో నటిస్తున్న విషయం తెలిసిందే.

ఈ సినిమా త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రానుంది.ఇకపోతే సాయి పల్లవి డాన్స్ కి ఉన్న ఫ్యాన్స్ ఫాలోయింగ్ గురించి అయితే ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.

ఆమె డాన్స్ కు సపరేట్ ఫాన్స్ ఫాలోయింగ్ ఉంది అనడంలో ఎటువంటి సందేహం లేదు.ఇప్పటికే చాలా సందర్భాలలో స్టేజ్ పై డ్యాన్స్ చేసి ప్రతి ఒక్కరిని ఆశ్చర్యపరిచిన ఈ ముద్దుగుమ్మ తాజాగా మరోసారి తనలో ఉన్న డాన్స్ టాలెంట్ ని ప్రేక్షకులకు పరిచయం చేసింది.తాజాగా సాయి పల్లవి తన చెల్లెలు పెళ్లి చేసింది.

Advertisement

తమిళనాడు లో సంప్రదాయబద్ధంగా వీళ్ల వివాహం జరిగింది.ఈ పెళ్లిలో తన డాన్స్ తో అందర్నీ మెస్మరైజ్ చేసింది సాయిపల్లవి.5 పాటలకు సోలో పెర్ఫార్మెన్స్ ఇచ్చి ఆహుతుల్ని అలరించింది.తర్వాత బంధువులు, కుటుంబ సభ్యులతో కలిసి మరో 5, 6 పాటలకు డాన్స్ చేసింది.

పెళ్లిలో సాయి పల్లవి ప్రదర్శన ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది.ప్రస్తుతం ఆ వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.అదే టైమ్ లో సాయిపల్లవి పెళ్లి టాపిక్ కూడా తెరపైకొచ్చింది.

నువ్వు పెళ్లి ఎప్పుడు చేసుకుంటావ్ అంటూ చాలామంది ఆమెను ప్రశ్నించడం మొదలుపెట్టారు.తను జీవితంలో పెళ్లి చేసుకోనని గతంలో సాయిపల్లవి ప్రకటించిన సంగతి తెలిసిందే.

ప్రస్తుతం ఆ వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవ్వడంతో సాయి పల్లవి అభిమానులు ఆ వీడియోలో తెగ వైరల్ చేస్తూ కామెంట్ల వర్షం కురిపిస్తున్నారు.

రామ్ చరణ్ సుకుమార్ సినిమాలో హీరోయిన్ గా చేస్తున్న ఐటెం బ్యూటీ...
Advertisement

తాజా వార్తలు