ఆ విషయంలో సాయి పల్లవిని ట్రోల్స్ చేస్తున్న నెటిజన్స్.. చెల్లికి తెలియకుండా ఆ పని ఎలా చేస్తుందంటూ?

తెలుగు ప్రేక్షకులకు టాలీవుడ్ హీరోయిన్ సాయి పల్లవి గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.

అతి తక్కువ సమయంలోనే సాయి పల్లవి స్టార్ హీరోయిన్లలో ఒకరిగా గుర్తింపు తెచ్చుకుంది.

ఈమెకు యూత్ లో ఏ రేంజ్ లో ఫ్యాన్స్ ఫాలోయింగ్ ఉందో మనందరికీ తెలిసిందే.సాయి పల్లవిని అభిమానులు ముద్దుగా న్యాచురల్ బ్యూటీ అని కూడా పిలుస్తూ ఉంటారు.

కాగా తెలుగులో ఇప్పటివరకు సాయి ఫిదా, లవ్ స్టోరీ, ఎంసీఏ, ప్రేమమ్, పడి పడి లేచే మనసు, మారి, విరాటపర్వం లాంటి సినిమాలలో నటించి మెప్పించింది.ఇకపోతే సాయి పల్లవి చివరి రెండు సినిమాలు బాక్స్ ఆఫీస్ వద్ద డిజాస్టర్ లుగా నిలిచిన విషయం తెలిసిందే.

అప్పటినుంచి సాయి పల్లవి సినిమా ఇండస్ట్రీ గుడ్ బై చెప్పబోతుందని, త్వరలోనే పెళ్లి చేసుకొని సినిమాలకు బ్రేక్ తీసుకోనుంది అంటూ సోషల్ మీడియాలో ఎన్నో రకాల వార్తలు వినిపించిన సంగతి మనందరికీ తెలిసిందే.ఇప్పటివరకు సాయి పల్లవి ఆ వార్తలపై స్పందించలేదు.

Advertisement

ఇది ఇలా ఉంటే సాయి పల్లవి కి సంబంధించిన మరొక వార్త సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది.అదేమిటంటే అందరూ మంచిదే అనుకుంటున్నా సాయి పల్లవి తన చెల్లి విషయంలో మాత్రం చాలా స్ట్రిక్ట్ గా ఉంటుందని, ముఖ్యంగా సాయి పల్లవి ఏదైనా ఇష్టపడే డ్రెస్ కొనుక్కుంటే అది వెంటనే తన చెల్లి తనకు తెలియకుండా వేసుకుంటుందని, సాయి పల్లవి ఒక ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చిన విషయం తెలిసిందే.

అంతేకాకుండా తన చెల్లి దగ్గరి నుంచి ఆ డ్రెస్ ను దాచిపెట్టడానికి సాయి పల్లవి చాలా కష్టపడేదట.సాయి పల్లవికి తెలియకుండా ఆమె ఎక్కడో దాచి పెట్టేదట.అయితే మామూలుగా అక్కచెల్లెళ్ల మధ్య గొడవలు సర్వసాధారణం.కానీ సాయి పల్లవి మాత్రం తన చెల్లెలు

విషయంలో చాలా కఠినంగా ఉంటుందట.తనకు నచ్చిన డ్రెస్ ఇయర్ రింగ్స్ కొనుగోలు చేసి తన చెల్లికి తెలియకుండా దాచిపెట్టుకుంటుందట.అయితే ఇదే విషయంలో సాయి పల్లవిని కొందరు సిల్లిగా ట్రోల్స్ చేస్తున్నారు.

అయితే ఈ వార్తలపై సాయి పల్లవి అభిమానులు స్పందిస్తూ అలాంటి సిల్లి ట్రోలింగ్స్ చేసే వారిపై మండిపడుతున్నారు.

'హెలికాప్టర్ ' కోసం ఇంత పంచాయతీ జరుగుతోందా ? 
Advertisement

తాజా వార్తలు