ఆ ఫ్లాప్ డైరెక్టర్ కి అవకాశం ఇచ్చిన మెగా హీరో

మెగా హీరో సాయి ధరమ్ తేజ్ ప్రస్తుతం కెరీర్ లో ఆచితూచి సినిమాలు చేస్తున్నాడు.

వరుసగా 5 ఫ్లాపులు తర్వాత కాస్త స్లో అయిన తేజు కిషోర్ తిరుమల దర్శకత్వంలో చిత్రలహరి సినిమాతో కొద్ది రోజుల క్రితం ప్రేక్షకుల ముందుకు వచ్చి చాలా గ్యాప్ తర్వాత ఓ హిట్ ను తన ఖాతాలో వేసుకున్నాడు.

ఈ సినిమా అనుకున్న స్థాయిలో భారీగా కలెక్షన్లు రాబట్టలేకపోయిన చాలా గ్యాప్ తర్వాత తేజుకి కాస్త సంతృప్తినిచ్చిందని చెప్పాలి.ఇదిలా ఉంటే ప్రస్తుతం మారుతి దర్శకత్వంలో సాయిధరమ్ తేజ్ భోగి అనే టైటిల్ తో సినిమా ప్లాన్ చేస్తున్నారు.

ఈ సినిమా త్వరలో సెట్స్ పైకి వెళ్లే అవకాశం ఉంది.ఇందులో తేజుకి జోడిగా రాశికన్నా మరోసారి కనిపించబోతుంది.

ఇదిలా ఉంటే ఈ సినిమా తర్వాత ఫ్లాప్ దర్శకుడుకి తేజు గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు తెలుస్తోంది.ప్రస్థానం లాంటి సినిమాని తెలుగు ప్రేక్షకులకు అందించిన దర్శకుడు దేవా కట్టా తర్వాత ఆ స్థాయిలో సినిమాలను తెరకెక్కించ లేకపోయారు.

Advertisement

దీంతో అవకాశాలు లేక చాలా కాలంగా గా బాహుబలి ప్రీక్వెల్ గా తెరకెక్కుతున్న శివగామి వెబ్ సిరీస్ తెరకెక్కించే పనిలో బిజీగా ఉన్న ఈ దర్శకుడు చెప్పిన స్టోరీ లైన్ కి సాయి ధరమ్ తేజ్ ఓకే చెప్పినట్లు సమాచారం.ఈ సినిమా కూడా దేవా కట్ట స్టైల్లో సోషల్ డ్రామాగా ఉండబోతుంది అని తెలుస్తుంది.

మొత్తానికి ఇన్ని రోజులు కమర్షియల్ జోనర్ లో సినిమాలు చేసిన తేజ ఇప్పుడు తన స్టైల్ మార్చుకొని పూర్తిగా కథాబలం ఉన్న సినిమాలపై దృష్టి పెడుతున్నట్లు అతను ఓకే చెప్తున్నా దర్శకులు బట్టి తెలుస్తుంది.ప్లాట్ దర్శకుడిగా ముద్ర పడి సినిమాలకు దూరమైన దేవకట్ట ఇప్పుడు ఈ మెగా హీరోకి ఎంతవరకు సూపర్ హిట్ ఇస్తాడు అనేది వేచి చూడాలి.

Advertisement

తాజా వార్తలు